AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయసుతో పనిలేదు.. 50ఏళ్లలో కూడా అలా చెయ్యొచ్చు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. సినిమాల్లో రాణించాలని చాలా మంది హీరోయిన్ చూస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ముద్దుగుమ్మలు వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే మరికొంతమంది మాత్రం స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది సీనియర్ హీరోయిన్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు.

వయసుతో పనిలేదు.. 50ఏళ్లలో కూడా అలా చెయ్యొచ్చు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress Photos
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2025 | 1:26 PM

Share

తెలుగులో సూపర్ హిట్ సినిమాలు చేసింది. బడా హీరోల సినిమాల్లో నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఈ బ్యూటీ తన నటనతో పాటు అందంతోనూ ప్రేక్షకులను కవ్వించింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్న ఆ హీరోయిన్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైన కనిపిస్తున్న బ్యూటీ ఇండస్ట్రీలో చాలా పాపులర్ నటి. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఆ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వయసుతో పని లేదు అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు. మనీషా కొయిరాలా. ఈ అమ్మడు 1970 ఆగస్టు 16న నేపాల్ రాష్ట్రంలో జన్మించారు. 1991వ సంవత్సరంలో, నటి మనీషా కొయిరాలా చౌధాకర్ అనే హిందీ చిత్రంతో కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. మనీషా కొయిరాలా ఎక్కువగా బాలీవుడ్ సినిమాపై దృష్టి పెట్టింది. ఇక ఆమె నటించిన బొంబాయి, ఒకేఒక్కడు, భారతీయుడు సినిమాలు భారీ హిట్ అయ్యాయి. దాంతో ఒక్కసారిగా మనీష పేరు మారుమ్రోగింది.

ఇక మనీష క్యాన్సర్ తో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఇప్పుడు తిరిగి  సినిమాల్లో నటిస్తుంది. అది కూడా బాలీవుడ్ లోనే ఆమె నటిస్తుంది . రీసెంట్ గా హీరామండి సినిమాలో చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మనిషా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వయసుతో పని లేదు అంటుంది మనీష. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే.. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా మనం ఒక అద్భుతమైన జీవితాన్ని గడపగలం. నేను ఉన్నంత కాలం హాయిగా, అద్భుతంగా, మస్ఫూర్తిగా జీవించాలని అనుకుంటున్నా.. అని మనీష కొయిరాలా చెప్పుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..