Jahnvi Kapoor: తెలుగు తెరకు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్.. ఈసారైనా పక్కానా ?..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దర్శకనిర్మాతలు పోటీగా పాన్ ఇండియా లెవల్లో చిత్రాలను తెరకెక్కిస్తూ
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దర్శకనిర్మాతలు పోటీగా పాన్ ఇండియా లెవల్లో చిత్రాలను తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలో నేషనల్ వైడ్గా రికార్డ్స్ క్రియేట్ చేయగా.. మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబోలో రాబోతున్న లైగర్ (Liger) సినిమా ఒకటి. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటే.. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో మరో మూవీ రాబోతుంది. అదే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమణ .
ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు పూరీ అండ్ టీం. ఇందులో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. జేజీఎం అంటూ విజయ్ ను సైనికుడిగా పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చే జనగణమణ చిత్రాన్ని ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన దివంగత అగ్రకథానాయక శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇందులోకి జాన్వీని తీసుకోవడానికి పూరీ శతవిధాలుగా ప్రయత్నారని.. చివరకు కరణ్ జోహార్ సాయంతో జాన్వీని ఒప్పించారని సమాచరం. శ్రీదేవి కుటుంబంతో కరణ్ జోహార్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. జాన్వీ మొదటి చిత్రాన్ని నిర్మించింది కూడా కరణ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే విజయ్ కు జోడీగా నటించేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
Also Read: Gaalivaana: జీ5లో మరో థ్రిల్లింగ్ వెబ్ సిరిస్.. గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Raviteja: రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ.. టైగర్ నాగేశ్వర్ రావుకు జోడీ ఎవరంటే..
Acid Reflux: తిన్న తర్వాత ఛాతీలో మంటగా ఉంటుందా ?.. ఇలా చేస్తే తొందరగా రిలీఫ్..
Coffee Benefits: కాఫీ తాగడం వల్ల ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే..