AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి.. 47ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ కోరిక

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే గడిపేస్తున్నారు. యంగ్ హీరోయిన్స్ వరుసగా పెళ్లిపీటలెక్కుతుంటే.. కొంతమంది సీనియర్ భామలు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే మిగిలిపోతున్నారు. నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకోని హీరోయిన్స్ ఉన్నారు..

పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి.. 47ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ కోరిక
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2025 | 9:01 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్  కెరీర్ మీద ఫోకస్ పెట్టి పెళ్లి అనేదానికి దూరంగా ఉంటున్నారు. రీసెంట్ డేస్ లో కుర్ర హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ మాత్రం సినిమాలతో బిజీగా ఉంటూ నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో ఈ చిన్నది ఒకరు. తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వయసు ఇప్పుడు 47ఏళ్లు.. ఈ వయసులో తనకు పార్ట్‌నర్‌ కావాలి అంటుంది. అంతే కాదు తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో కూడా చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరంటే..

ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకొని హీరోయిన్స్ లో బాలీవుడ్ అందాల భామ దివ్యా దత్తా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నటి మాత్రమే కాదు మోడల్, రచయిత్రి కూడా.. ఈ బ్యూటీ ఎక్కువగా హిందీ, పంజాబీ సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే మలయాళం, ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా కొన్ని పాత్రలు చేసింది. అలాగే ఈ భామ తన ఆత్మకథ “మీ అండ్ మా: ఫైండింగ్ ది ఫస్ట్ లవ్”ను 2017లో విడుదల చేసింది. ఇందులో తన జీవితం, తల్లితో బంధం గురించి వివరించింది.

ఇవి కూడా చదవండి

తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దివ్య కు.. ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. 47 సంవత్సరాల వయస్సులో కూడా ఆమె ఇంకా వివాహం చేసుకోలేదు. ఈ విషయంపై ఆమె ఓపెన్‌గా తన అభిప్రాయాలను తెలియజేసింది. దివ్యా దత్తా మాట్లాడుతూ, “తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే, సొంతంగా సంతోషంగా ఉండటం మేలు. నేను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు, కానీ నాతో పాటు ప్రయాణం చేయగల ఒక పార్ట్‌నర్ ఉంటే బాగుంటుంది. అలాంటి వ్యక్తి లేకపోయినా నేను సంతోషంగానే ఉన్నాను” అని తెలిపింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో, ముఖ్యంగా X ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Divya Dutta (@divyadutta25)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..