AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను.. అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అడవి శేష్. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోగా మారి వరుస హిట్స్ అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అడవి శేష్ కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించాడు.

మా అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను.. అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
Adivi Sesh
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2025 | 8:34 AM

Share

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల లిస్ట్ లో అడవిశేష్ ముందు వరసలో ఉంటాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. కాగా అడవి శేష్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. అడవి శేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే కర్మ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో కామియో చేశాడు. ఇక ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గూఢచారి, హిట్ 2, ఎవరు, మేజర్, సినిమాలతో హిట్స్ అందుకున్నాడు శేష్. త్వరలోనే మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అడవి శేష్.

ఇటీవలే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు శేష్. ప్రస్తుతం  గూఢచారి 2 సినిమాతో పాటు డెకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అడవి శేష్ ఓ టీవీ షోకు హాజరయ్యాడు. డాన్స్ షోకు అడవి శేష్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ షోలో ఉన్న బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శేష్ ను చూసి షాక్ అయ్యింది. శేష్ ను చూసి సర్ ప్రైజ్ అయిన అశ్విని శ్రీ.. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్‌కు చెప్పింది.

ఇవి కూడా చదవండి

మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని అశ్విని చెప్పగానే .. శేష్ కూడా నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆతర్వాత మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ వస్తుంది అని చెప్పి షాక్ ఇచ్చింది. దాంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అని అశ్విని చెప్పగానే శేష్ అవాక్ అయ్యాడు. ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి శేష్ నవ్వుతూ సరే సరే అంటూ ఆపేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..