AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: అలియా సంచలన నిర్ణయం.. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూతురి ఫొటోలు డిలీట్.. కారణమిదే!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా చేరువైన ఈ అందాల తార తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి కూతురు రాహా కపూర్ ఫొటోలను డిలీట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Alia Bhatt: అలియా సంచలన నిర్ణయం.. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూతురి ఫొటోలు డిలీట్.. కారణమిదే!
Alia Bhatt
Basha Shek
|

Updated on: Mar 02, 2025 | 8:21 AM

Share

బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటుంది. ముఖ్యంగా తన ముద్దుల కూతురు రాహా కపూర్ ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాయి. ఇవి క్షణాల్లోనే తెగ వైరలవుతుంటాయి. అలియా స్వయంగా తన కూతురి ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆలియా ఉన్నట్లుండి తన కూతురి ఫోటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. దీంతో ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత, ఆలియా రాహా కోసం కూడా ‘నో ఫోటో పాలసీ’ని అమలు చేస్తుందనే చర్చ జరుగుతోంది. అలియా నిర్ణయం తర్వాత అభిమానులు కూడా షాక్ అయ్యారు. అదే సమయంలో చాలా మంది ఆమె నిర్ణయాన్ని సమర్థించారు.

అలియా ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం వెనక రాహా భద్రత ప్రధాన కారణముందని అభిమానులు చెబుతున్నారు. నిజం చెప్పాలంటే, జనవరి 16న, సైఫ్, కరీనా ఇంట్లోకి తెలియని వ్యక్తి ప్రవేశించాడు. పిల్లలపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు. దాడి చేసిన వ్యక్తి బారి నుంచి పిల్లలను రక్షించే క్రమంలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తు చేసిన వ్యక్తి సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత, సైఫ్ అలీ ఖాన్ తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. ఆ సంఘటన తర్వాత, సైఫ్-కరీనా తైమూర్, జెహ్ కోసం ‘నో ఫోటో పాలసీ’ని కూడా అమలు చేస్తున్నారు. ఈ కరమంలోనే సైఫ్ పై దాడి తర్వాత, ఆలియా కూడా రాహా ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా నుంచి తొలగించిందని చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్ర నటి కాబట్టి, ఆమె కూతురు రాహా కపూర్ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. రాహా కపూర్ ప్రస్తుతం స్టార్ కిడ్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అలియా, రణబీర్ రహా కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అలియా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి అలియా నిరంతరం రాహ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అభిమానులు కూడా నటి ప్రతి పోస్ట్‌కు లైక్‌లు, కామెంట్ వర్షం కురిపిస్తుంటారు.

భర్త, కూతురితో అలియా భట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి