AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Nagalla: ‘మీ నడుము బాగుంటుంది మేడమ్’.. అభిమాని మాటకు అనన్య షాకింగ్ రియాక్షన్.. అసలు ఊహించలేదుగా!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది వరంగల్ అమ్మాయి అనన్య నాగళ్ల. గతేడాది ఆమె నటించిన ఏకంగా నాలుగు చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్‌ హోల్మ్స్‌, డార్లింగ్ సినిమాల్లో అనన్య నాగళ్ల నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Ananya Nagalla: 'మీ నడుము బాగుంటుంది మేడమ్'.. అభిమాని మాటకు అనన్య షాకింగ్ రియాక్షన్.. అసలు ఊహించలేదుగా!
Ananya Nagalla
Basha Shek
|

Updated on: Mar 02, 2025 | 8:26 AM

Share

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్లు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషన్ విషయాలను అందులో పంచుకుంటుంది. అలాగే తన లేటెస్ట్ అండ్ గ్లామరస్ ఫొటోలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. ఇక తీరిక దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ముచ్చటిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అభిమానుల నుంచి సినిమా తారలకు చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య ఒక ఆసక్తికరమైన విషయాన్ని అందరితో పంచుకుంది. బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఓ టాక్ షోకు గెస్టుగా హాజరైందీ తెలుగమ్మాయి. ఈ సందర్భంగా ‘మీ జీవితంలో ఎదురైన బెస్ట్‌, నాటీ కంప్లిమేంట్‌’ ఏంటి అని అరియానా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా అనన్య తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.

ఆ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది..

‘ కెరీర్‌ ప్రారంభంలో ఇంకా అప్పటికీ పెద్దగా గ్లామర్‌ పాత్రలో నటించని సమయంలో ఓ షాప్‌ ఓపెనింగ్‌ వెళ్లాను. ఆ సమయంలో ఓ అభిమాని ఎంతో ఆతృతగా నా వద్దకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చిన వెంటన ‘మేడమ్‌ మీ నడుము చాలా బాగుంది’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ కామెంట్‌ వల్ల నాకు కోపం రాలేదు. పైగా ఆ కాంప్లిమెంట్ నాకు బాగా నచ్చింది’ అని అనన్య నాగళ్ల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శ్రీ శైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అనన్య నాగళ్ల..

కాగా ఇటీవల మహా శివరాత్రి సందర్భంగా శ్రీ శైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంది అనన్య నాగళ్ల. అక్కడ శివునికి ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇటీవల అనన్య నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటోంది.. ఇందులో అనన్య పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతకు ముందు పొట్టేల్ సినిమాలోనూ ఈ బ్యూటీ రోల్ కు మంచి మార్కులే పడ్డాయి.

అనన్య నాగళ్ల మిర్రర్ సెల్ఫీ వీడియో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
ఎంతోమంది జీవితాన్ని మార్చిన మాల..ఇది ధరిస్తే మీ తలరాత మారడం పక్కా
ఎంతోమంది జీవితాన్ని మార్చిన మాల..ఇది ధరిస్తే మీ తలరాత మారడం పక్కా
బాసరకు కొత్త శోభ.. అంగరంగ వైభవంగా నూతన ఆలయ నిర్మాణం
బాసరకు కొత్త శోభ.. అంగరంగ వైభవంగా నూతన ఆలయ నిర్మాణం
పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే..
పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే..