Vikrant Massey: 12th ఫెయిల్ సినిమాకు జాతీయ అవార్డ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో..

వచ్చే నెలలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ సినిమా కూడా పోటీపడనుంది. ఇందులో నటనకుగానూ విక్రాంత్ మస్సేకు జాతీయ అవార్డు వస్తుందని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన న్యూస్ తెగ వైరలవుతుండగా.. తాజాగా హీరో విక్రాంత్ మస్సే రియాక్ట్ అయ్యారు. ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డ్ కంటే గొప్పదని అన్నారు.

Vikrant Massey: 12th ఫెయిల్ సినిమాకు జాతీయ అవార్డ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో..
Vikranth Massey
Follow us

|

Updated on: Jul 27, 2024 | 9:02 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి అత్యధిక వసూళ్లు రాబట్టాయి. అందులో 12th ఫెయిల్ సినిమా ఒకటి. డైరెక్టర్ విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరో విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించారు. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఈసినిమాలో ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ సాధించింది. అలాగే ఈ మూవీ జాతీయ అవార్డుల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ సినిమా కూడా పోటీపడనుంది. ఇందులో నటనకుగానూ విక్రాంత్ మస్సేకు జాతీయ అవార్డు వస్తుందని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన న్యూస్ తెగ వైరలవుతుండగా.. తాజాగా హీరో విక్రాంత్ మస్సే రియాక్ట్ అయ్యారు. ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డ్ కంటే గొప్పదని అన్నారు.

“మా సినిమా జాతీయ అవార్డుల బరిలో నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటివరకు ఇది ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఎన్నో గోప్ప వేదికలపై ఈ సినిమాను ప్రదర్శించారు. నా నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నాను. జాతీయ అవార్డు వస్తుందని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాను. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆవేశం, ది గోట్ లైఫ్ వంటి చిత్రాల్లో స్టార్స్ నటన అద్భుతం. వారి సరసన నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జాతీయ అవార్డ్ వస్తుందా.. రాదా అనే విషయం గురించి మాట్లాడుకోవడానికి సరైన సమయం కాదు.. ” అని పేర్కొన్నారు.

బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు విక్రాంత్ మస్సే. గతంలో సూపర్ హిట్ అయిన బాలిక వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్లో శ్యామ్ పాత్రలో కనిపించిన విక్రాంత్ మస్సే.. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఇటీవలే 12th ఫెయిల్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో ఈ సినిమాను రూపొందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.