Tollywood: ఏంటి సార్.. మీరిలా! చొక్కా, హెల్మెట్ లేకుండా బైక్‌పై రయ్ రయ్.. స్టార్ హీరోపై విమర్శలు.. వీడియో
ఈ వైరల్ వీడియోలో నటుడు చొక్కా, హెల్మెట్ ధరించకుండా రయ్ రయ్ మంటూ బైక్ పై దూసుకెళ్లిపోయాడు. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు మండి పడుతున్నారు. స్టార్ నటుడై ఉండి ఇలాంటి పిచ్చి పనులు చేయడం తగదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

చాలా మంది ఈ హీరోను తమ రోల్ మోడల్‌గా భావిస్తారు. ఇందుకు కారణం సినిమాలు మాత్రమే కాదు అతను చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు. నిజజీవితంలో ఎన్నో మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం అతను పలు సినిమాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. అలాంటి నటుడిపై ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. అతనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నటుడు చొక్కా, హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ కనిపించాడు. దీంతో నెటిజన్లు ఈ రియల్ హీరోపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక్ బైక్ రైడింగ్ తో ట్రోల్స్ ఎదుర్కొంటోన్న ఆ నటుడు మరెవరో కాదు రియల్ హీరో సోనూసూద్.
సినిమా షూటింగులతో బిజీగా ఉండే సోను సూద్ తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీకి వెళ్లారు. అక్కడ గడ్డ కట్టె చలిలో కొంతమంది బైకర్స్ తో కలిసి బైక్ రైడింగ్ చేశారు. అయితే చొక్కా, హెల్మెట్ లేకుండా కేవలం షార్ట్ మాత్రమే వేసుకొని బైక్ రైడ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రమాదకరమైన పర్వత ప్రాంతాలలో కూడా హెల్మెట్ లేకుండా బైక్ పై దూసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.ప్రజలకు ఆదర్శంగా నిలిచే సోను సూద్ ఈ విధంగా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘స్పితిలో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినందుకు సోను సూద్ పై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకోరా?సెలబ్రిటీలు చట్టానికి అతీతులా?’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా స్పందించాడు.
నెట్టింట వైరలవుతోన్న సోనూ సూద్ బైక్ రైడింగ్ వీడియో..
So will @himachalpolice take any action on @SonuSood for riding naked without a helmet in Spiti? No protective gear, no clothes — for god knows what he is trying to promote. Are celebrities above the law?@splahhp #HimachalPradesh pic.twitter.com/3XUDBYkXqN
— Nikhil saini (@iNikhilsaini) May 26, 2025
స్పందించిన పోలీసులు..
వైరల్ అయిన సోనూ సూద్ వీడియోపై స్పితి పోలీసులు స్పందించారు. ‘బాలీవుడ్ నటుడు సోను సూద్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ వీడియో 2023 నాటిది. ఎందుకైనా వీడియో ప్రామాణికతను ధృవీకరించడం మంచిది. ఒక వేళ నిజమని తేలితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని పోలీసులు బదులిచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




