AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa Movie: కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‏తో యువతి పరారీ.. ఇద్దరిపై కేసు నమోదు..

మంచు విష్ణు నటించిన సినిమా కన్నప్ప రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్‌డ్రైవ్‌ ముంబై నుంచి హైదరాబాద్‌కి ఇటీవల కొరియర్ చేశారు. అయితే ఈనెల 25న ఆ కొరియర్‌ను ఆఫీస్‌బాయ్‌ తీసుకున్నా.. మేనేజ్‌మెంట్‌కు దాన్ని ఇవ్వలేదు. ఓ అమ్మాయి హార్డ్ డ్రైవ్ తీసుకొని పరారీ అయినట్లు సమాచారం.

Kannappa Movie: కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‏తో యువతి పరారీ.. ఇద్దరిపై కేసు నమోదు..
Kannappa Movie
Rajitha Chanti
|

Updated on: May 27, 2025 | 11:40 AM

Share

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయమైనట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా హార్డ్ డ్రైవ్ తీసుకెళ్లారని ఫిల్మ్ నగర్ పోలీసులకు తెలిపారు. వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన వీఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు (హైవ్ స్టూడియోస్) కన్నప్ప సినిమాకు సంబంధించి కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్‏ను ఇటీవల డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్‏లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. డీటీడీసీ డెలివరీ రికార్డుల ప్రకారం సదరు పార్శిల్ ఈనెల 25న కార్యాలయానికి చేరుకుంది.

అయితే ఆ పార్శిల్ తీసకున్న ఆఫీస్ బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడు. ఆ తర్వాత హార్డ్ డ్రైవ్ తీసుకున్న ఆ అమ్మాయి ఎవరికీ కనిపించకుండా తిరుగుతుంది. కొందరు వ్యక్తుల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న చరిత సినిమాకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రెడ్డి విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంతో తమ సినిమా ప్రాజెక్టుకు తీవ్ర అంతారాయం కలిగించిందని.. సదరు హార్డ్ డ్రైవ్ లో కన్నప్ప సినిమాకు సంబంధించి విడుదల చేయని, గోప్యమైన , సున్నితమైన కంటెంట్ ఉందని.. దానిని లీక్ చేయడం లేదా.. డిలీట్ చేయడం వల్ల తమకు ఆర్థికంగా కోలుకోలేని నష్టం కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే హార్డ్ డ్రైవ్ ను రికవరీ చేసి తమకు అప్పగించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్ల పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..