AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సాయి పల్లవితో ఆ సీన్ చేయాలంటే భయపడిపోయిన నటుడు.. ఆమె ఫాలోయింగ్ చూసి..

న్యాచురల్ బ్యూటీ సాయి ప్లలవి, కృతి శెట్టి, నాని ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. నాని, సాయి పల్లవిల జోడిగా మరోసారి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో మనీష్ వాధ్వా ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. ఇందులో సాయి పల్లవితో ఓ సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడిపోయినట్లుగా తెలిపారు.

Sai Pallavi: సాయి పల్లవితో ఆ సీన్ చేయాలంటే భయపడిపోయిన నటుడు.. ఆమె ఫాలోయింగ్ చూసి..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2023 | 5:30 PM

Share

ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమా గదర్ 2. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమీషా పటేల్ కథానాయికగా నటించగా.. ఉత్కర్ష్ శర్మ్ కీలకపాత్రలో కనిపించారు. ఆగస్ట్ 11న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.435 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మనీష్ వాధ్వా పాకిస్తాన్ మేజర్ జనరల్ హమీద్ ఇక్బాల్ పాత్రను పోషించాడు. ఇందులో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించాడు మనీష్ వాధ్వా. అతను చివరిసారిగా షారుఖ్ ఖాన్ సరసన పఠాన్‌లో ఇలాంటి పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు గదర్ 2 చిత్రంతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. మనీష్ వాధ్వా తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని పేరు. కానీ అతను తెలుగు సినిమాల్లోనూ విలన్ పాత్రలు పోషించారు. అందులో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన శ్యామ్ సింగరాయ్ సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు.

న్యాచురల్ బ్యూటీ సాయి ప్లలవి, కృతి శెట్టి, నాని ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. నాని, సాయి పల్లవిల జోడిగా మరోసారి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో మనీష్ వాధ్వా ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. ఇందులో సాయి పల్లవితో ఓ సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడిపోయినట్లుగా తెలిపారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో కనిపించింది సాయి పల్లవి. అయితే వారికి గురువుగా మనీష్ వాధ్వా నటించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో అతను సాయి పల్లవిని తీవ్రంగా కొట్టి.. ఆ తర్వాత ఆమెపై మూత్ర విసర్జన సన్నివేశం ఉంటుంది. అయితే ఆ సీన్ చేయాల్సి వచ్చినప్పుడు అంతను చాలా భయపడ్డానని చెప్పుకొచ్చారు.

ఎందుకంటే సాయి పల్లవికి సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా సాయి అంటే దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. అలాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ తో అలాంటి సీన్ చేయడం అతనికి భయం కలిగించిందట. ఆ సీన్ చేసిన తర్వాత ఆమె ఫ్యాన్స్ తనను బెదిరించవచ్చని.. అలాగే అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఊహించుకుని భయపడిపోయినట్లుగా చెప్పారు. ప్రస్తుతం మనీష్ వాధ్వా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మనీష్ నటుడు మాత్రమే కాదు.. వాయిస్ ఆర్టిస్ట్ కూడా. ఇప్పటివరకు అతను మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పఠాన్, పద్మావత్ వంటి అతని సినిమాలు, చంద్రగుప్త మౌర్య , పేష్వా బాజీరావు వంటి కొన్ని టీవీ సిరీస్‌లు అతనికి పరిశ్రమలో గుర్తింపునిచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చంద్రగ్రహణం: ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా..?
చంద్రగ్రహణం: ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా..?
BCCI vs BCB: టీ20 వరల్డ్ కప్ వివాదం తర్వాత బంగ్లా యూటూర్న్..
BCCI vs BCB: టీ20 వరల్డ్ కప్ వివాదం తర్వాత బంగ్లా యూటూర్న్..
చనిపోయిందనుకున్న భార్య నుంచి ఓటీపీ.. పరుగెత్తుకెళ్లిన భర్త..
చనిపోయిందనుకున్న భార్య నుంచి ఓటీపీ.. పరుగెత్తుకెళ్లిన భర్త..
ఆపరేషన్ సిందూర్ పై సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
ఆపరేషన్ సిందూర్ పై సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
మాంసం తినే మొక్కలు.. దగ్గరికి వచ్చిన క్షణాల్లోనే మింగేస్తాయి..!
మాంసం తినే మొక్కలు.. దగ్గరికి వచ్చిన క్షణాల్లోనే మింగేస్తాయి..!
ఏపీలోని రైతులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్
ఏపీలోని రైతులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్
టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే టీమిండియానే తోపు.. దరిదాపుల్లో లేవుగా
టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే టీమిండియానే తోపు.. దరిదాపుల్లో లేవుగా
సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే
సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే
పిండితో పని లేకుండా.. హోటల్ స్టైల్లో దోసెలు ఇలా వేసేయండి
పిండితో పని లేకుండా.. హోటల్ స్టైల్లో దోసెలు ఇలా వేసేయండి
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? రెండో జాబితాపై క్లారిటీ
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? రెండో జాబితాపై క్లారిటీ