Jr.NTR: ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం.. తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో..
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాగే ఇటీవలే దేవర సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం హిందీలో వార్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. ఈ క్రమంలో బీటౌన్ స్టార్ హీరో తారక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్ ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత తారక్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తోపాటు బీటౌన్ హీరో హృతిక్ రోషన్ సైతం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో తారక్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ మూవీ అప్డేట్స్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న హృతిక్ రోషన్ వార్ 2 సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే తారక్ గురించి మాట్లాడుతూ.. “నాకు ఇష్టమైన సహనటుడు ఎన్టీఆర్. అతడు గొప్ప నటుడు. మంచి టీమ్ మేట్. మా సినిమా అద్భుతంగా వచ్చింది. ఒకపాట మినహా వార్ 2 సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగస్ట్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న” అని అన్నారు. దీంతో అక్కడున్నవారంత ఫుల్ ఖుషీ అయ్యారు.
గతంలో స్పై థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన వార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇందులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అదే వార్ 2. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..