AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అక్కా.! నీకో దండం.. భర్తను అమ్మేసిన భార్య.. కారణం తెలిస్తే బిత్తరపోతారు

భోపాల్ ఫ్యామిలీ కోర్టులో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల వైవాహిక బంధానికి భార్య స్వయంగా ముగింపు పలకడమే కాదు, తన భర్తను అతని ప్రియురాలికి రూ. 1.5 కోట్లకు అప్పగించింది. భర్త ప్రియురాలితోనే ఉంటానని చెప్పడంతో, ఈ ఒప్పందం కుదిరింది.

Viral: అక్కా.! నీకో దండం.. భర్తను అమ్మేసిన భార్య.. కారణం తెలిస్తే బిత్తరపోతారు
Marriage
Ravi Kiran
|

Updated on: Feb 17, 2026 | 1:05 PM

Share

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఇటీవలే ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన భర్త వివాహేతర సంబంధాన్ని భరించలేకపోయిన ఒక భార్య, న్యాయస్థానం సమక్షంలోనే అతడిని అతడి ప్రియురాలికి కోటి 60 లక్షల రూపాయలకు అమ్మేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు వివరాల ప్రకారం, 43 ఏళ్ల భర్తకు తన భార్యతో పెళ్లై, వారికి 14, 16 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంసారం సజావుగా సాగుతున్న క్రమంలో, భర్త తన పనిచేసే చోట 53 ఏళ్ల మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ సంబంధం తీవ్ర స్థాయికి చేరి, భర్త తన భార్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. ప్రియురాలే తనకు సర్వస్వం అని, భార్య అవసరం లేదని అతను తరచుగా చెప్పడం మొదలుపెట్టాడు.

దీంతో ఇంట్లో రోజూ గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి. పెద్దవారైన పిల్లలు కూడా తల్లిదండ్రుల మధ్య నిరంతరం జరిగే ఈ గొడవలతో తీవ్ర మనస్తాపానికి, విరక్తికి గురయ్యారు. కుటుంబంలో శాంతి లేకుండా పోవడంతో, ఈ సమస్యను పరిష్కరించాలని భావించిన దంపతులు చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ముగ్గురిని – భర్త, భార్య, ప్రియురాలు – పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించింది. ఈ కౌన్సిలింగ్‌లోనూ, తదుపరి వాదోపవాదాల్లోనూ భర్త తన ప్రియురాలితోనే కలిసి జీవించాలని స్పష్టంగా చెప్పాడు. భార్య మాత్రం మొదట తన భర్తను వదులుకోవడానికి నిరాకరించింది. అయితే, భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో, చివరకు ఆమె ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. విసిగిపోయిన భార్య న్యాయమూర్తి ముందు ఒక డిమాండ్ చేసింది. తన భర్తను ప్రియురాలు స్వీకరించాలనుకుంటే, అందుకు ప్రతిఫలంగా తనకు కోటి 60 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ను ప్రియురాలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించింది.

డబ్బు తనకు ముఖ్యం కాదని, కేవలం భర్తను తనకిచ్చేయాలని ఆమె పేర్కొంది. తక్షణమే ఒక పెద్ద విల్లాను, అదనంగా 26 లక్షల రూపాయల నగదును భార్యకు అప్పగించింది. ఈ ఒప్పందం ద్వారా భార్యాభర్తలు విడిపోయారు. భర్త నుంచి భార్యకు రావాల్సిన భరణం, అలాగే పిల్లలకు సంబంధించిన ఆస్తులు న్యాయపరంగా అందే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఘటనతో భర్త, భార్యల మధ్య వివాదానికి తెరపడింది. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఇష్టం లేని చోట బ్రతకాల్సిన అవసరం లేదని, అయితే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారి భవిష్యత్తు, సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించాలని సూచించారు. పిల్లల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.

Follow Us