AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉద్యోగం ఎందుకని కిలో బంగారంతో ఉడాయించాడు.. కట్ చేస్తే ఊహించని సీన్‌తో..

కంచే చేను మేసిన చందంగా.. నమ్మకంగా పనిచేయాల్సిన సేల్స్ ఎగ్జిక్యూటివే ఏకంగా రూ. 1.6 కోట్ల విలువైన బంగారాన్ని మాయం చేశాడు. పది బంగారు బిస్కెట్లను అత్యంత చాకచక్యంగా బూట్లు, లోదుస్తుల్లో దాచుకుని.. ఎవరికీ అనుమానం రాకుండా పారిపోయాడు. అయితే పోలీసులు ముందు అతడి ఆటలు సాగలేదు. చివరకు ఎలా చిక్కాడంటే..?

Hyderabad: ఉద్యోగం ఎందుకని కిలో బంగారంతో ఉడాయించాడు.. కట్ చేస్తే ఊహించని సీన్‌తో..
Panjagutta Joyalukkas Gold Theft Solved
Krishna S
|

Updated on: Feb 17, 2026 | 12:55 PM

Share

నమ్మకంగా పనిచేయాల్సిన సేల్స్ ఎగ్జిక్యూటివే యజమాని కళ్లుగప్పి కోట్లాది రూపాయల బంగారాన్ని దోచుకున్నాడు. అయితే అతడి తెలివితేటలు పోలీసుల ముందు పనిచేయలేదు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఏపీలోని తాడేపల్లిలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి.. రూ.1.6 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని జోయాలుక్కాస్ జ్యువెలరీ షాపులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు సినిమా ఫక్కీలో ఛేదించారు. ఫిబ్రవరి 14న రాత్రి 9 గంటల సమయంలో షోరూమ్‌లోని స్టాక్ సరిచూసుకోగా.. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న 10 బంగారు బిస్కెట్లు మాయమైనట్లు షోరూమ్ మేనేజర్ జిన్స్ సెబాస్టియన్ గుర్తించారు. దీనిపై ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

బూట్లు, లోదుస్తుల్లో బంగారు బిస్కెట్లు

పోలీసులు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న కె.గోపాలకృష్ణ శనివారం సాయంత్రం 4:50 గంటల సమయంలో అత్యంత చాకచక్యంగా 10 బంగారు బిస్కెట్లను తన బూట్లు, లోదుస్తుల్లో దాచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే తన బైక్‌పై దుకాణం నుండి పరారయ్యాడు.

తాడేపల్లిలో ట్యాప్ చేసిన పోలీసులు

ఈ కేసును సవాలుగా తీసుకున్న పంజాగుట్ట ఏసీపీ మురళీ కృష్ణ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుడి మొబైల్ ఫోన్ డేటా విశ్లేషణ, సీసీటీవీల ఆధారంగా అతడు ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రే తాడేపల్లిలోని నిందితుడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 1.6 కోట్ల విలువైన మొత్తం బంగారాన్ని రికవరీ చేశారు. అలాగే నేరానికి ఉపయోగించిన బైక్, స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదైన రోజే నిందితుడిని పట్టుకుని, సొత్తు మొత్తం రికవరీ చేసిన దర్యాప్తు బృందాన్ని సీనియర్ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us
ఉద్యోగం ఎందుకని కిలో బంగారంతో ఉడాయించాడు.. కట్ చేస్తే ఊహించని..
ఉద్యోగం ఎందుకని కిలో బంగారంతో ఉడాయించాడు.. కట్ చేస్తే ఊహించని..
తాగినాక మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే యమ డేంజరస్..
తాగినాక మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే యమ డేంజరస్..
తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం
తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం
పాట మీద ఎవరి రైట్స్ ఏంటి?.. హక్కులు ఎవరికి ఉంటాయ్.. ?
పాట మీద ఎవరి రైట్స్ ఏంటి?.. హక్కులు ఎవరికి ఉంటాయ్.. ?
పాక్ ఓటమిపై నఖ్వీ ఆగ్రహం.. బాబర్, అఫ్రిదిపై వేటు?
పాక్ ఓటమిపై నఖ్వీ ఆగ్రహం.. బాబర్, అఫ్రిదిపై వేటు?
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నాయకత్వం.. ఈ జన్మ సంఖ్య మీదైతే అదృష్టం..
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నాయకత్వం.. ఈ జన్మ సంఖ్య మీదైతే అదృష్టం..
ఆ ఊరిలో అమ్మాయికి పెళ్లయితే ఫస్ట్ నైట్ వాడితోనే జరగాలట..
ఆ ఊరిలో అమ్మాయికి పెళ్లయితే ఫస్ట్ నైట్ వాడితోనే జరగాలట..
పండు కాదు.. పొషకాల పుట్ట! ప్రతిరోజూ తిన్నారంటే..ఆ సమస్యలు పరార్
పండు కాదు.. పొషకాల పుట్ట! ప్రతిరోజూ తిన్నారంటే..ఆ సమస్యలు పరార్
షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌
షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌
పీఎం కిసాన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. బ్యాంక్ అకౌంట్లోకి అప్పుడే
పీఎం కిసాన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. బ్యాంక్ అకౌంట్లోకి అప్పుడే