AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Song Copy Rights : పాటల పై వివాదం.. అసలు సాంగ్ మీద హక్కులు ఏంటీ.. ? ఎవరికి ఉంటాయ్.. ?

ప్రస్తుతం దక్షిణాదిలో పాటల వివాదం నడుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, సరిగమ సంస్థ మధ్య కొన్ని రోజులుగా ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాశంగా మారాయి. అసలు ఈ వివాదం ఏంటీ.. ? పాటలపై హక్కులు ఎవరికీ ఉంటాయ్. ? ఎంత మేర హక్కులుంటాయి? అనేది తెలుసుకుందాం.

Song Copy Rights : పాటల పై వివాదం.. అసలు సాంగ్ మీద హక్కులు ఏంటీ.. ? ఎవరికి ఉంటాయ్.. ?
Ilayaraja Songs
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 12:57 PM

Share

పాటల విషయంలో జరుగుతున్న వివాదాలు రీసెంట్‌ టైమ్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పాటల విషయంలో కాంట్రవర్శీ అంటే ట్యూన్‌ని కాపీ కొట్టేశారనో, తమ లిరిక్స్ ని ఉన్నవున్నట్టు వాడేశారనో… పదాల్లో ద్వంద్వార్థాలున్నాయనో… ఇలాంటివే ఉండేవి. కానీ, ఇళయరాజా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాక అంతా కొత్తగా వినిపించసాగింది. తాను కంపోజ్‌ చేసిన పాటలను కాన్సర్టుల్లో పాడేటప్పుడు తన అనుమతి తీసుకోవాలంటూ ఇళయరాజా కొత్తగా వివాదాన్ని స్టార్ట్ చేశారు. ఆ పాట పాడిన సింగర్స్ కి రైట్స్ ఉండవా? అంటూ బాలసుబ్రహ్మణ్యం గళం వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పాట మీద ఎవరికి ఏ రైట్స్ ఉంటాయి? ఎంత మేర హక్కులుంటాయి? ఐపీఆర్‌ యస్‌ ఏమంటోంది? పీపీఎల్‌ ఏమంటోంది? నోవెక్స్ ఏం చెబుతోంది? ఇండియన్‌ సింగర్స్ అసోసియేషన్‌ పరిస్థితి ఇప్పుడు ఏంటి?

ఐపీఆర్‌యస్‌

ఇండియన్‌ పెర్ఫార్మింగ్‌ రైట్‌ సొసైటీ లిమిటెడ్‌ అనేది కాపీరైట్‌ సొసైటీ. ఇందులో రచయితలు, కంపోజర్స్, పబ్లిషర్స్ ఉంటారు. లీగల్‌ గా ప్లే అయిన మ్యూజిక్‌ నుంచి ఐపీఆర్‌యస్‌కి రాయల్టీ రూపంలోడబ్బులు అందుతాయి. వీళ్లు ఆ మొత్తాన్ని కంపోజర్‌కి 25 శాతం, రచయితలకు 25శాతం, మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ కి 50 శాతంగా కేటాయిస్తారు. మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ కేటగిరీలో ఒరిజినల్‌ సినిమా ప్రొడ్యూసర్‌, ఒరిజినల్‌ మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ ఉండవచ్చు. లేకుంటే వాళ్లు మ్యూజిక్‌ లేబుల్‌కి తన షేర్‌ని విక్రయించి ఉండవచ్చు. ఒకవేళ విక్రయించిన పక్షంలో సదరు మ్యూజిక్‌ లేబుల్‌ ఆ 50 శాతాన్ని తమ ఖాతాలో వేసుకుంటుంది.

పీపీయల్‌

1941లో మొదలైంది ఫొనోగ్రాఫిక్‌ పెర్పార్మెన్స్ లిమిటెడ్‌. సంగీత ప్రపంచంలో పీపీయల్‌ అంటే తెలియనివారు అరుదు. సౌండ్‌ రికార్డింగ్స్ కి సంబంధించి ఈ సంస్థ బాధ్యతలు తీసుకుంటుంది. దాదాపు 450కి పైగా మ్యూజిక్‌ లేబుల్స్ ఇందులో ఉంటాయి. దాదాపు 70 లక్షలకు పైగా ఇంటర్నేషనల్‌, డొమెస్టిక్‌ సౌండ్‌ రికార్డింగ్స్ వీరి ఆధ్వర్యంలో ఉంటాయి. రెస్టారెంట్స్, బార్స్, ఈవెంట్స్ లో ప్లే చేసే మ్యూజిక్‌ మీద ఈ సంస్థ రాయల్టీ వసూలు చేస్తుంది. సంబంధిత కళాకారులకు పంపిణీ చేస్తుంది. ఆర్టిస్టులకు సపోర్ట్ చేయండి… వర్రీ ఫ్రీగా మ్యూజిక్‌ ప్లే చేయండి అనే నినాదంతో పని చేస్తుంది.

నావెక్స్

పబ్లిక్‌ పెర్ఫార్మెన్స్ లో సౌండ్‌ రికార్డింగ్స్ ని ఇండియాలో మేనేజ్‌ చేస్తుంది నావెక్స్ కమ్యూనికేషన్స్. కమర్షియల్‌ ఈవెంట్స్, వెడ్డింగ్స్, కార్పొరేట్‌ షోస్‌, హోటల్స్, మాల్స్ వంటివాటిల్లో ప్లే అయ్యే మ్యూజిక్‌ కి రాయల్టీ కలెక్ట్ చేస్తుందీ సంస్థ. ఇందులో ఉన్న లేబుల్స్ కి వీళ్లు రాయల్టీ ని పంపిణీ చేస్తారు. ఇప్పుడంటే అందరూ పీపీయల్‌ వైపు మొగ్గుచూపుతున్నారు గానీ.. ఒకప్పుడు నావెక్స్ ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేసేదన్నది సీనియర్స్ మాట.

ఇండియన్‌ సింగర్స్ అండ్‌ మ్యుజీషియన్స్ రైట్స్ అసోసియేషన్‌

ఐపీఆర్‌యస్ లో సింగర్స్ కి ఎలాంటి ప్రాధాన్యం లేదు. 1957 కాపీ రైట్స్ యాక్ట్ కి 2012లో చేసిన అమెండ్‌మెంట్‌ ప్రకారం ఐపీఆర్‌యస్‌లో సింగర్స్ కి రాయల్టీ రాదు. వాళ్లు కంటెంట్‌ క్రియేటర్స్ కాదని, అందుకే రాయల్టీ ఇవ్వట్లేదంటుంది ఐపీఆర్‌యస్‌. మరి అలాంటప్పుడు తమ కష్టాన్ని ఎవరు గుర్తించాలంటూ ఆలోచించి 2013లో ఏర్పడ్డదే ఇండియన్‌ సింగర్స్ అండ్‌ మ్యుజీషియన్స్ రైట్స్ అసోసియేషన్‌. ఈ సంస్థ కోసం మరీ ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన కృషి మరువలేనిది అని అంటారు గాయనీగాయకులు. స్టేజ్‌ల మీద గాయనీగాయకులు పాడినప్పుడు, ప్రదర్శనలు ఇచ్చినప్పుడు రాయల్టీ వసూలు వేసి, సంబంధిత కళాకారులకు పంపిణీ చేసే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటైంది. బాలసుబ్రహ్మణ్యం తదనంతరం ఈ సంస్థ కూడా పీపీయల్‌లో భాగమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

Follow Us
ఉద్యోగం ఎందుకని కిలో బంగారంతో ఉడాయించాడు.. కట్ చేస్తే ఊహించని..
ఉద్యోగం ఎందుకని కిలో బంగారంతో ఉడాయించాడు.. కట్ చేస్తే ఊహించని..
తాగినాక మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే యమ డేంజరస్..
తాగినాక మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే యమ డేంజరస్..
తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం
తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం
పాట మీద ఎవరి రైట్స్ ఏంటి?.. హక్కులు ఎవరికి ఉంటాయ్.. ?
పాట మీద ఎవరి రైట్స్ ఏంటి?.. హక్కులు ఎవరికి ఉంటాయ్.. ?
పాక్ ఓటమిపై నఖ్వీ ఆగ్రహం.. బాబర్, అఫ్రిదిపై వేటు?
పాక్ ఓటమిపై నఖ్వీ ఆగ్రహం.. బాబర్, అఫ్రిదిపై వేటు?
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నాయకత్వం.. ఈ జన్మ సంఖ్య మీదైతే అదృష్టం..
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నాయకత్వం.. ఈ జన్మ సంఖ్య మీదైతే అదృష్టం..
ఆ ఊరిలో అమ్మాయికి పెళ్లయితే ఫస్ట్ నైట్ వాడితోనే జరగాలట..
ఆ ఊరిలో అమ్మాయికి పెళ్లయితే ఫస్ట్ నైట్ వాడితోనే జరగాలట..
పండు కాదు.. పొషకాల పుట్ట! ప్రతిరోజూ తిన్నారంటే..ఆ సమస్యలు పరార్
పండు కాదు.. పొషకాల పుట్ట! ప్రతిరోజూ తిన్నారంటే..ఆ సమస్యలు పరార్
షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌
షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌
పీఎం కిసాన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. బ్యాంక్ అకౌంట్లోకి అప్పుడే
పీఎం కిసాన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. బ్యాంక్ అకౌంట్లోకి అప్పుడే