Kota Srinivas Rao: ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. నా పాత్ర ఇప్పటికీ ట్రెండింగే.. కోట శ్రీనివాస రావు..
తెలుగు సినిమా ప్రపంచంలో నటుడిగా, విలన్ గా తనదైన ముద్ర వేశారు దివంగత నటుడు కోట శ్రీనివాస రావు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో పోషించిన ప్రత్యేకమైన పాత్రల గురించి వివరించారు.

దివగంత నటుడు కోట శ్రీనివాస రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో సుదీర్ఘ సినీ ప్రస్థానం, విశేషమైన పాత్రల గురించి వివరంగా పంచుకున్నారు. వెయ్యికి పైగా సినిమాలు చేసే హాస్యనటులతో తన పాత్రలను పోల్చలేమని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది హాస్యనటులు ఒకటీ రెండు సీన్లలో వచ్చి వెళుతుంటారని, అయితే తాను మొదటి నుండి హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్ లేదా విలన్ వంటి కీలక పాత్రలను మాత్రమే పోషించానని తెలిపారు. ఈ పాత్రలకు సినిమా మొత్తం అవసరం ఉండటంతో, కనీసం 10-12 రోజుల కాల్ షీట్స్ అవసరమయ్యేవని, అందుకే తాను ఎక్కువ సినిమాలు చేయలేకపోయానని వివరించారు. తాను పోషించిన వందలాది పాత్రలలో ఇప్పటికీ తన మదిలో, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన పాత్ర ఆహ నా పెళ్ళంట చిత్రంలోని పిసినారి వేషం అని అన్నారు. ఆ మహానుభావుడు జంధ్యాల ఆ పాత్రను ఎంతో గొప్పగా తీర్చిదిద్దారని ప్రశంసించారని అన్నారు. జంధ్యాల, సుందరమూర్తి, ఆత్రేయ వంటి గొప్ప రచయితలు, మహానుభావులు ఇప్పుడు లేరని, అలాంటి వారు మళ్ళీ పుట్టాలని కోరికను వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..
ప్రతిఘటన చిత్రంలోని తన పాత్ర కాశీ గురించి గుర్తు చేసుకుంటూ, ఆ చిత్రంలో తను ఒక పార్టీ ప్రెసిడెంట్‌గా విలన్‌ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామని చెప్పే సన్నివేశంలోని తెలంగాణ యాస డైలాగులను పలికారు. “హైదరాబాద్ కి రైలు గాడిలో పోయేటందుకు పైసలు ఉన్న ప్రతివాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన్ని ప్రజాస్వామ్యం అంటే ఏంది భాయ్ అని అడిగినాం అనుకో హైదరాబాద్ లో ఆడు ఉండే హోటల్ పేరు చెప్తాడు. డిస్ అండ్ దెమాక్లే అని వాళ్ళందరూ నా తాన్ కి వచ్చి నాకు సీటు కావాలి, నాకు సీటు కావాలి అని నన్ను సంపుకు తింటుండ్రు. మరి నేను ఏం చేయాలి? అంత ఆన ఉన్న పైసలు చూసి, అంత ఆన ఉన్న సత్తా చూసి నేను నిలబెట్టాలి.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?
గసండి పైసలు కానీ, సత్తా కానీ ఈ కాళీగానికి ఉంది. అందుకే ఆయన్ని చేపిస్తున్నాం,” అని ఆ డైలాగును అనర్గళంగా పలికారు. ఆ సినిమాలో రామారావు గారు గాంధీ పాత్రలో “మేము రౌడీలని, గూండాలని మేము ఒప్పుకోము” అని అంటారని, అప్పుడు ఆయనతో తాను, “సీటు నీకు ఇయ్యలేదని ఈయనతో గొడవ పడుతున్నావు. నువ్వా పెద్దోనివి అయిపోతివి. లటక్కన చచ్చినావు అనుకో బై ఎలక్షన్ పెట్టాలి. ఈ అపడపుడు పడతారయ్యా ఈ పాట్లన్నీ” అని సంభాషణ సాగుతుందని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..
ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..
