AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasantha Nuvve : ఉదయ్ కిరణ్‏తో బ్లాక్ బస్టర్.. 14 ఏళ్లుగా సినిమాలకు దూరంగా.. ఎందుకు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయింది.. ?

తెలుగు సినిమా ప్రపంచంలో గ్లామరస్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. అందులో రీమా సేన్ ఒకరు. ప్రస్తుతం థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న మనసంతా నువ్వే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఇప్పుడేం చేస్తుందో తెలుసుకుందామా.

Manasantha Nuvve : ఉదయ్ కిరణ్‏తో బ్లాక్ బస్టర్.. 14 ఏళ్లుగా సినిమాలకు దూరంగా.. ఎందుకు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయింది.. ?
Manasantha Nuvve Movie
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2026 | 12:39 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ రెస్పాన్స్ ఎలా ఉందో చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం తర్వాత వెండితెరపై ఉదయ్ కిరణ్ ను చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అలాగే ఈసినిమాను అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన రీమాసేన్ కథానాయికగా నటించింది. తనురాయ్, సిజ్జు, పరుచూరి, చంద్రమోహన్, బ్రహ్మానందం, సునీల్ కీలకపాత్రలలో నటించారు. అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా సంచలనం సృష్టించింది.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

మనసంతా నువ్వే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ రీమాసేన్. 2000 సంవత్సరంలో రీమా సేన్ గ్లామరస్ బ్యూటీలలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించింది. తెలుగులో మనసంతా నువ్వే మూవీతో హిట్ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆడపాదడపా చిత్రాల్లో నటించిన రీమా సేన్.. 2012 తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మనసంతా నువ్వే మూవీ రీరిలీజ్ కావడంతో ఈ బ్యూటీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

రీమా సేన్ తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు 2012లో వివాహం చేసుకుంది. వ్యాపారవేత్త శివ కరణ్ సింగ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. రీమా 2013లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లిగా ప్రమోషన్ పొందిన తర్వాత చలనచిత్ర పరిశ్రమకు రీమా సేన్ పూర్తిగా దూరమయ్యింది. 12 సంవత్సరాలలో 30 కి పైగా సినిమాలు చేసిన ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సైలెంట్ గా ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

View this post on Instagram

A post shared by Reema Sen (@senreema29)

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

Follow Us
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నాయకత్వం.. ఈ జన్మ సంఖ్య మీదైతే అదృష్టం..
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నాయకత్వం.. ఈ జన్మ సంఖ్య మీదైతే అదృష్టం..
ఆ ఊరిలో అమ్మాయికి పెళ్లయితే ఫస్ట్ నైట్ వాడితోనే జరగాలట..
ఆ ఊరిలో అమ్మాయికి పెళ్లయితే ఫస్ట్ నైట్ వాడితోనే జరగాలట..
పండు కాదు.. పొషకాల పుట్ట! ప్రతిరోజూ తిన్నారంటే..ఆ సమస్యలు పరార్
పండు కాదు.. పొషకాల పుట్ట! ప్రతిరోజూ తిన్నారంటే..ఆ సమస్యలు పరార్
షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌
షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌
పీఎం కిసాన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. బ్యాంక్ అకౌంట్లోకి అప్పుడే
పీఎం కిసాన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. బ్యాంక్ అకౌంట్లోకి అప్పుడే
మనసంతా నువ్వే హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
మనసంతా నువ్వే హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
AI ఇంపాక్ట్ సమ్మిట్.. అతిథుల కోసం ఎన్ని రకాల వంటకాలో..!
AI ఇంపాక్ట్ సమ్మిట్.. అతిథుల కోసం ఎన్ని రకాల వంటకాలో..!
చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్
చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్
షేక్ హ్యాండ్ కోసం ఆశగా ఎదురుచూసిన పాక్ ఆటగాళ్లు.. మైదానం వీడకుండా
షేక్ హ్యాండ్ కోసం ఆశగా ఎదురుచూసిన పాక్ ఆటగాళ్లు.. మైదానం వీడకుండా
పట్టపగలు రైలు పట్టాలపై వింత ఆకారం.. స్థానికుల అరుపులు, కేకలు..
పట్టపగలు రైలు పట్టాలపై వింత ఆకారం.. స్థానికుల అరుపులు, కేకలు..