Bigg Boss 8 Telugu: కమెడియన్స్ అన్నవాళ్ల నోరు మూయించాడు.. హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ అతనే

బిగ్ బాస్ హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ ను పంపిస్తూ టికెట్ టు ఫినాలే కోసం టాస్క్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి అందాల యాంకర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీముఖిని పంపించారు.

Bigg Boss 8 Telugu: కమెడియన్స్ అన్నవాళ్ల నోరు మూయించాడు.. హౌస్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ అతనే
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 30, 2024 | 9:23 AM

బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో మొట్టమొదటి ఫైనలిస్ట్ ఎవరో తెలిసిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ ను పంపిస్తూ టికెట్ టు ఫినాలే కోసం టాస్క్ లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి అందాల యాంకర్, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీముఖిని పంపించారు. ప్రస్తుతం హౌస్ లో నిఖిల్, రోహిణి, అవినాష్‌లు టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అయ్యారు . అయితే విష్ణు ప్రియ, నబీల్, ప్రేరణలకు బ్లాక్ బ్యాడ్జ్‌లు రావడంతో ఈ రేస్ నుంచి వాళ్లు తప్పుకున్నారు. ఇక మిగిలిన గౌతమ్, పృథ్వీ, టేస్టీ తేజాలు అసలు కంటెడర్స్కే కూడా కాలేదు కాబట్టి వారికీ మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. రేస్ లో ఉన్న ముగ్గురు డిస్కస్ చేసి గౌతమ్, పృథ్వీ, టేస్టీ తేజాల్లో ఒకరిని సెలక్ట్ చేసుకొని.. నాలుగో కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని చెప్పాడు. అలాగే అందుకు తగ్గ కారణాలు కూడా చెప్పాలి అని అన్నారు.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ చిన్నది

ఇక చాలా సేపు డిస్కషన్ తర్వాత టేస్టీ తేజాను సెలక్ట్ చేసుకున్నారు. తేజకు ఛాన్స్ రావడంతో పృథ్వీ తెగ ఫీల్ అయ్యాడు. తేజ, రోహిణి, అవినాష్‌లు కమెడియన్లు వాళ్ళు రేస్ లో ఉండటానికి అర్హులు కాదు అని మాట్లాడాడు. ఇక శ్రీముఖి ఎంటర్ అయినా తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది.

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

ఇక ముందుగా గంటకొట్టు గుర్తుపెట్టు అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ లో హౌస్ లో ఉన్న వస్తువులను, బొమ్మలను టీవీలో చూపించారు. అవిఇంట్లో ఎక్కడ ఉందో చెప్పాలి. ఎవరైతే ముందుగా గంటకొడతారో వారికే ఛాన్స్ అని చెప్పింది శ్రీముఖి. ఈ టాస్క్ లో నిఖిల్ కు 4, అవినాష్ కు 3, రోహిణికి 2, తేజకు 1 పాయింట్ రావడంతో తక్కువ పాయింట్స్ వచ్చిన తేజ ఈ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఆతర్వాత నిఖిల్, అవినాష్, రోహిణికి కలిపి ఓ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఎవరు విన్ అవుతారో వారే ఫస్ట్ ఫైనలిస్ట్ అని అనౌన్స్ చేశారు. టికెట్ టు ఫినాలే రేస్‌లో అవినాష్‌కి అన్నీ కలిసి రావడంతో.. అతను విన్నర్ గా నిలిచాడు. అందరూ నిఖిల్ విన్ అవుతాడు అని అనుకున్నారు కానీ .. అవినాష్ ఎక్కడా తగ్గకుండా.. ఆడి విన్ అయ్యి చూపించాడు. కమెడియన్స్ అన్నవారి నోరు మూయించాడు అవినాష్.

16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..