AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దర్శకుడిగా దళపతి విజయ్ కొడుకు ఎంట్రీ.. ఆకట్టుకుంటున్న మోషన్ పోస్టర్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

దర్శకుడిగా దళపతి విజయ్ కొడుకు ఎంట్రీ.. ఆకట్టుకుంటున్న మోషన్ పోస్టర్
Jason Sanjay
Rajeev Rayala
|

Updated on: Nov 30, 2024 | 8:27 AM

Share

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. జేసన్ దర్శకత్వం వహించే మొదటి సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, హీరో, నిర్మాత, ఎడిటర్, సంగీత దర్శకుడు ఎవరనే సమాచారం విడుదలైంది.

ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ చిన్నది

మోషన్ పోస్టర్ ను లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. లైకా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత GKM తమిళ కుమారన్ మాట్లాడుతూ, తమ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఎల్లప్పుడూ మంచి కథకులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని, జాసన్ కథను అందించినప్పుడు, దానిలో కొత్తదనం కనిపించిందని అన్నారు.

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

పాన్-ఇండియా స్థాయిలో దృష్టిని ఆకర్షించడానికి జాసన్ ఒక అద్భుతమైన కథను చెప్పాడని, ఈ చిత్రం యొక్క ప్రధాన కథ ఎంతో ఆసక్తిగా వాస్తవికంగా ఉంటుంది. నిజజీవితంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. జనవరి 2025 నాటికి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తమిళ కుమరన్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ సంగీతం అందించారు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత కెఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ చేస్తున్నారు.  దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో బిజీ కానున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు విజయ్. ఇదే ఆయన చివరి చిత్రం అంటున్నారు.

16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..