Bigg Boss 5 telugu: హౌస్ నుంచి బయటకు వచ్చేసిన కాజల్.. మిగిలిన వారిగురించి ఏమన్నదంటే..!

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. ఇప్పటివరకు ఇంట్లో ఆరుగురు ఇంటిసభ్యులు ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ తో ఒకరు హౌస్ నుంచి బయటకు రావడంతో ఇప్పుడు హౌస్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు.

Bigg Boss 5 telugu: హౌస్ నుంచి బయటకు వచ్చేసిన కాజల్.. మిగిలిన వారిగురించి ఏమన్నదంటే..!
Kajal
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2021 | 6:47 AM

Bigg Boss 5 telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. ఇప్పటివరకు ఇంట్లో ఆరుగురు ఇంటిసభ్యులు ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ తో ఒకరు హౌస్ నుంచి బయటకు రావడంతో ఇప్పుడు హౌస్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వారాంతం కావడంతో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ తో అతలాడించాడు. శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షన్ను,  కాజల్  మిగలగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అందరు ఊహించినట్టే కాజల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. కాజల్ అవుట్ అవ్వడంతో.. ఇప్పుడు హౌస్ లో ఐదుగురు శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షన్ను మిగిలారు. ఇక బయటకు వచ్చిన కాజల్ మిగిలిన హౌస్ మేట్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

ఇక ఆదివారం రోజు చిట్టీలో వచ్చిన పాటను.. పాడకుండా, స్టెప్పులు వేయకుండా యాక్ట్ చేసి మాత్రమే చూపించాలి అనే అట ఆడించారు నాగ్. ఇందులో కోసం శ్రీరామచంద్ర, కాజల్, షన్ను ఒక టీం. మిగిలిన మానస్, సిరి, సన్నీలను మరో టీంగా విడగొట్టారు. ముందుగా కాజల్ ఆడింది. ఆమెకు జెమిని సినిమాలోని నడక చూస్తే వయ్యారం  అనే పాట ఇచ్చాడు. ఈ పాటను శ్రీరామ్ కనిపెట్టేశాడు. అనంతరం మానస్ రాగా అతడికి నడక కలిసిన నవరాత్రి అనే పాట రాగ.. సన్నీ ఈజీగా గెస్ చేసేశాడు. ఆతర్వాత శ్రీరామచంద్రకు ఉప్పెన సినిమానుంచి నీ కన్ను నీలి సముద్రం అనే పాట రాగా షన్ను గెస్ చేశాడు. ఆతర్వాత సన్నీకి చెన్నకేశవ రెడ్డి సినిమాలోని నీ కొప్పులో నా మల్లెతోట అనే పాటను రాగా.. దాన్ని ఎవ్వరూ గెస్ చేయలేకపోయారు. న్నుకి కాలేజ్ పాపల బస్సు అనే పాటను రాగా దాన్ని కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఆ తరువాత సిరికి కోపమా నా పైన అనే పాట రాగా.. సన్నీ వెంటనే గెస్ చేశాడు. మళ్లీ కాజల్ కు ఛాన్స్ వచ్చింది. కాజల్‌కు మాస్ సినిమాలోని నాతో వస్తావా? అనే పాట వచ్చింది. షన్ను గెస్ చేసేశాడు. మానస్‌కు హల్లో హల్లో అంటూ వచ్చిన పాటను సరిగ్గా కనిపెట్టలేకపోయారు. దాంతో శ్రీరామ్ చంద్ర విన్ అయ్యాడు.

చివరకు ఎలిమినేషన్ సమయంలో టెన్షన్ పెట్టాడు నాగార్జున. ఇక షన్ను మరో ఫైనలిస్ట్ అని నాగార్జున ప్రకటించాడు. చివరకు కాజల్ ఎలిమినేట్ అయింది. మానస్ టాప్ 5లోకి వెళ్లిపోయాడు. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన కాజల్.. ఇంటి సభ్యులకు ఒక్కో ఎమోషన్ ఇచ్చి వారి గురించి చెప్పింది. అందులో సన్నీని మోస్ట్ ఎంటర్టైనర్‌గా చెప్పింది. ఇక మానస్‌కు ఫ్రెండ్ షిప్ అనే ట్యాగ్ ఇచ్చింది.శ్రీరామచంద్రకు యాక్షన్ అనే ట్యాగ్ ఇచ్చింది. సిరి అయితే ఏదీ దాచుకోలేదు అని, తన ఎమోషన్స్ అన్నీ కూడా బయటపెట్టేస్తుందని చెప్పికొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Victrina Wedding: నెట్టింట్లో వైరలవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ వీడియో.. రాజమహల్‌ను తలపిస్తోన్న హోటల్‌..

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి