Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ పై రంకెలేసిన శివాజీ.. నేను వెళ్ళిపోతా అంటూ రచ్చ రచ్చ

హౌస్ లో ఉన్న 14 మందిలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నారు. బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్నది ఎవరో తెలుసా.. దామిని, శివాజీ, శోభా శెట్టి, గౌతమ్, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, రతిక , షకీలా ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక హౌస్ లో ఉన్న వారిలో శివాజీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అలాగే తేజ కూడా అందరితో కలిసిపోతు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మూడో రోజు బిగ్ బాస్ హౌస్ లో పెద్ద రచ్చే జరిగింది. హీరో శివాజీ ఈ సారి ఓవరాక్షన్ చేశాడు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ పై రంకెలేసిన శివాజీ.. నేను వెళ్ళిపోతా అంటూ రచ్చ రచ్చ
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 07, 2023 | 11:49 AM

బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడిప్పుడే రసవత్త్రరంగా మారుతుంది. హౌస్ లో కి వెళ్లిన 14 మంది అప్పుడే గొడవలతో హీటు పుట్టిస్తున్నారు. అప్పుడే గేమ్స్ కూడా స్టార్ట్ చేశారు. హౌస్ లో ఉన్న 14 మందిలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నారు. బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్నది ఎవరో తెలుసా.. దామిని, శివాజీ, శోభా శెట్టి, గౌతమ్, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, రతిక , షకీలా ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక హౌస్ లో ఉన్న వారిలో శివాజీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అలాగే తేజ కూడా అందరితో కలిసిపోతు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మూడో రోజు బిగ్ బాస్ హౌస్ లో పెద్ద రచ్చే జరిగింది. హీరో శివాజీ ఈ సారి ఓవరాక్షన్ చేశాడు. బిగ్ బాస్ పై కేకలు వేస్తూ హంగామా చేశాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో శివాజి బిగ్ బాస్ పై అరవడం మనం చూడొచ్చు.

శివాజీ బిగ్ బాస్ పై రంకెలేశాడు. కాఫీ పంపించలేదని బిగ్ బాస్ పై అరిచి గోల చేశాడు. అయితే శివాజీ పై బిగ్ బాస్ కామెడీ చేయడంతో అతను మరింత రెచ్చిపోయాడు. శివాజీ బీపీ చెక్ చేయమని బీపీ మిషన్ ను పంపించాడు. దాంతో శివాజీకి చిర్రెత్తుకొచ్చింది. నా మీద జోకులేస్తావా.. ఎవ్వడికి భయపడేది లేదు తలుపు తీయ్ ఇప్పుడే వెళ్ళిపోతా అంటూ మండిపడ్డాడు శివాజీ.

శివాజీకి బీపీ ఎక్కువ కావడంతో మిగిలిన వారంతా చూస్తూ ఉండిపోయారు. ఆతర్వాత రతికాకు ఓ స్కెథాస్ స్కోప్ ఇచ్చి అందరి హార్ట్ ఏం చెప్తుందో వినమన్నాడు. కానీ శివాజీ దాన్ని లాక్కొని ఎవరి హార్ట్ బీట్ వింటావ్. నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే అతను జోకులేస్తున్నాడు అంటూ అరిచి గోల చేశాడు. తలుపు తీయ్ నేను వెళ్ళిపోతా అంటూ హడావిడి చేశాడు. మరి శివాజీ ఆ తర్వాత ఏం చేశాడు. బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయాడా అన్నది నేటి ఎపిసోడ్ లో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.