Tiger Nageswara Rao: వివాదంలో టైగర్ నాగేశ్వరరావు.. సినిమా ఆపేయాలంటూ నిరసన
ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకున్నారు మాస్ రాజా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో రవితేజ చిరు తమ్ముడిగా కనిపించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత రవితేజ నటించిన రావణాసుర సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచినా ఈ సినిమా ఓటీటీలో మంచి ఫ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రవితేజ.
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న నయా మూవీ టైగర్ నాగేశ్వరరావు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రవితేజ. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకున్నారు మాస్ రాజా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో రవితేజ చిరు తమ్ముడిగా కనిపించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత రవితేజ నటించిన రావణాసుర సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచినా ఈ సినిమా ఓటీటీలో మంచి ఫ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రవితేజ. టైగర్ నాగేశ్వరరావు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
స్టువర్టుపురంలోని ఓ గజ దొంగ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాను ఆపేయాలని అంటున్నారు కొందరు. టైగర్ నాగేశ్వరరావు విడుదల చేయొద్దంటూ డిమాండ్ చేస్తూ స్టువర్టుపురం గ్రామస్థులు నిరసనకు దిగారు.
View this post on Instagram
ఈ సినిమాలో తమ జాతిని, తమ గ్రామాన్ని అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయని నిరసన చేస్తున్నారు స్టువర్టుపురం గ్రామస్థులు. ఎరుకల జాతిని అవమానించేలా సినిమా తెరకెక్కిస్తున్నారని నిరసన చేస్తున్నారు గ్రామస్థులు. ఇప్పటికే హైకోర్టులో స్టువర్టుపురం గ్రామస్థులు పీటీషన్ దాఖలు చేశారు. ఈ సినిమాతో లక్షల మంది ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీస్తున్నారని స్టువర్టుపురం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
View this post on Instagram
విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర ఎరుకలు నిరసనదీక్ష చేపట్టారు స్టువర్టుపురం గ్రామస్థులు. దక్షణ భారత దేశంలోని నేర రాజధానిగా చూపిస్తూ టీజర్ ఉందని ఆరోపిస్తున్నారు గ్రామస్థులు. ఈ సినిమా విడుదలను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.