Bigg Boss: ఇదెవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ షోలోకి ఒలింపిక్ ఛాంపియన్! ఇక టీఆర్పీ రికార్డులు బద్దలే
బుల్లితెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ ఈ ఆదివారం (సెప్టెంబర్ 06) గ్రాండ్ గా ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకే రోజు బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది.

బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈసారి అన్ని భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ ఉండనుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హిందీలో బిగ్ బాస్ సీజన్ 20 గ్రాండ్ లాంఛ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘దబంగ్’ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. బిగ్ బాస్ హిందీ 20 పై రోజుకో అప్డేట్ వస్తోంది. అలాగే ఈసారి పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్ల గురించి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ల పేర్లు ఖరారయ్యాయని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ 20’ షోలో పాల్గొనే వారి జాబితాలో ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఈ బాక్సింగ్ క్వీన్ ను చూడాలని అభిమానులు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. అంతేకాదు మేరీ కోమ్ బిగ్ బాస్ లోకి ఎంటరైతే రియాలిటీ షో టీఆర్పీ కొత్త పుంతలు తొక్కే అవకాశముందని బిగ్ బాస్ మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
కాగా మేరీ కోమ్ 1983 మార్చి 1న మణిపూర్‌లోని ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె బాల్యంలో పొలాల్లో పనిచేస్తూ, చదువుకున్నారు. , కేవలం 15 ఏళ్ల వయసులో, ఆమె ఇంటిని విడిచిపెట్టి బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. మేరీ కోమ్ చిన్నప్పటి నుంచే బాక్సింగ్ కోసం పగలూ రాత్రీ శ్రమించారు. 15 ఏళ్ల వయసులో ఇంఫాల్ స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. తల్లిదండ్రులతో పాటు, ఆమె భర్త ఓన్లర్ కోమ్ కూడా మేరీ కోమ్ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 1998 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న మణిపూర్ బాక్సర్ డింకో సింగ్ స్ఫూర్తితో మేరీ కోమ్ బాక్సర్ కావాలని నిర్ణయించుకుంది. 2001, 2002, 2005, 2006, 2008, 2010, 2018లో ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ప్రపంచంలోని ఏకైక మహిళా బాక్సర్ మేరీ కోమ్. ఇక 2012లో లండన్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు మేరీ. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారు.
క్రీడా రంగానికి మేరీ కోమ్ చేసిన అపూర్వమైన సేవలకు గాను, భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులతో సత్కరించింది. ఆమె 2016 నుండి 2022 వరకు రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేశారు. 2005లో ఫుట్‌బాల్ క్రీడాకారుడు కరుంగ్ ఓన్లర్ కోమ్‌ను వివాహం చేసుకుంది మేరీ కోమ్. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 2007లో కవలలు, 2013లో ఒక కుమారుడు, 2018లో ఒక కుమార్తె జన్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
