AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : టాలీవుడ్ హీరోయిన్‏తో 7 ఏళ్లు సహజీవనం.. 53 ఏళ్ల వయసులో విలన్ రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లల సమక్షంలో..

ఆమె తెలుగులో క్రేజీ హీరోయిన్.. అతడు హిందీలో తోపు విలన్.. ఇద్దరి మధ్య 15 ఏళ్ల వయసు వ్యత్యాసం. కానీ ప్రేమకు ఏజ్ తో పనిలేదంటూ నిరూపించింది ఈ జంట. దాదాపు ఏడేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Tollywood : టాలీవుడ్ హీరోయిన్‏తో 7 ఏళ్లు సహజీవనం.. 53 ఏళ్ల వయసులో విలన్ రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లల సమక్షంలో..
Arjun Rampal
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2026 | 10:20 AM

Share

బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ తన సుదీర్ఘకాల ప్రేమికురాలు, మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌ను వివాహం చేసుకున్నారు. గత ఏడేళ్లుగా సహజీవనంలో ఉన్న ఈ జంట, గోవా వేదికగా అత్యంత సరళమైన రీతిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఉత్తర గోవాలోని మపుసా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల వీరి వివాహం జరిగింది. గోవా యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) నిబంధనల ప్రకారం సబ్-రిజిస్ట్రార్ సూరజ్ వెర్నేకర్ సమక్షంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేడుకకు కేవలం అత్యంత సన్నిహితులు, కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వేడుక కోలాహలం లేకుండా, ఇద్దరూ సాధారణ దుస్తులు ధరించి రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయడం గమనార్హం.

ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా 2018 నుంచి ప్రేమలో ఉన్నారు. సుదీర్ఘకాలంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అరిక్ 2019లో జన్మించగా, రెండో కుమారుడు ఆరవ్ 2023లో జన్మించాడు. డిసెంబర్ 2025లో ఈ జంట అధికారికంగా నిశ్చితార్థం చేసుకుంది. తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుకునే ఈ జంట, చివరకు పెళ్లి పీటలెక్కడంతో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

నటుడిగా అర్జున్ రాంపాల్ హిందీలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా, విలన్‌గా మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన బాగా పరిచితుడే. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో అర్జున్ రాంపాల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు గాబ్రియెల్లా సౌతాఫ్రికాలో పుట్టి పెరిగిన మోడల్ , ఫ్యాషన్ డిజైనర్. ఆమె కూడా పలు హిందీ ప్రాజెక్ట్‌లలో నటించింది. అంతేకాకుండా, అక్కినేని నాగార్జున, కార్తి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఊపిరి’లో గాబ్రియెల్లా ఒక ముఖ్య పాత్రలో నటించి తెలుగు ఆడియెన్స్‌ను అలరించింది. అర్జున్ రాంపాల్‌కు ఇది రెండో వివాహం. గతంలో మాజీ సూపర్‌మోడల్ మెహర్ జెస్సియాను 1998లో వివాహం చేసుకున్న ఆయన, 2019లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ బంధం ద్వారా వారికి మైరా, మహికా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు గాబ్రియెల్లాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించి వార్తల్లో నిలిచారు.

ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‏కు అర్థం ఇదే..

అర్జున్ రాంపాల్..

Arjun Rampal Wife

Arjun Rampal Wife

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..

Follow Us