Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. ఓటీటీలోకి వచ్చేసిన పళ్ల బురుసు, కొరియన్ కనకరాజు చిత్రాలు.. సినీ ప్రియులకు పండగే..
ఈ వారం ఓటీటీ సినీప్రియులను అలరించేందుకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీదకు వచ్చేశాయి. ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసే సినిమాలతోపాటు కడుపుబ్బా నవ్వించే చిత్రాలు సైతం అడియన్స్ ముందుకు వచ్చేశాయి. పళ్లబురుసు, కొరియన్ కనకరాజు చిత్రాలతోపాటు ఈ వారం ఏఏ చిత్రాలు విడుదలయ్యాయో తెలుసుకుందామా.

ఈ వారం సినీ ప్రియులకు, ఓటీటీ వీక్షకులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాటు, ఆసక్తికరమైన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, క్రైమ్ థ్రిల్లర్లు, కామెడీ చిత్రాలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు తగిన కంటెంట్ ఈ వీకెండ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆద్యంతం ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసిన సినిమా లిస్ట్ ఏంటీ.. ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందనేది తెలుసుకుందామా. ఈ వీకెండ్‌లో ఇంటి పట్టునే ఉంటూ సరికొత్త సినిమాలతో వినోదాన్ని ఆస్వాదించడానికి ఓటీటీ లవర్స్‌కు ఇది మంచి అవకాశం.
ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..
కొరియన్ కనకరాజు (Netflix): వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ హారర్ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ కథానాయికగా, సత్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
DC (Netflix): ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన చిత్రం ‘DC’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఉన్మాదం (SonyLIV): కుంచకో బోబన్, లిజోమోల్ జోస్ నటించిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉన్మాదం’. థియేటర్లలో మంచి ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఇప్పుడు సోనీలివ్‌లో వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
పళ్ళ బురుసు (Amazon Prime Video): అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించిన ‘పళ్ళ బురుసు’ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
GDN (Netflix): ఆర్. మాధవన్ నటించిన జి.డి. నాయుడు బయోపిక్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‌కు అర్థం ఇదే..
గాంధారి & ధమాల్ 4 (Netflix): తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’తో పాటు, అజయ్ దేవగణ్ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ధమాల్ 4’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
జగమే సంగీతం (Amazon Prime Video): ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో అలరిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..
