AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthi Bhat: దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఒక్క క్లిక్‌తో లక్షలు పోగొట్టుకుంది

కుమారి ఆంటీ ఫుడ్ గురించి కీర్తి భట్ వీడియో చేసింది. కర్రీస్ లో కారం ఎక్కువ ఉందని కీర్తి భట్, ఆమె భర్త వీడియో చేశారు. దాంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. కీర్తిని, ఆమె భర్తను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో కీర్తిభట్, ఆమె భర్త క్లారిటీ ఇచ్చారు కూడా..

Keerthi Bhat: దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఒక్క క్లిక్‌తో లక్షలు పోగొట్టుకుంది
Keerthi Bhat
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2024 | 3:51 PM

Share

ఈ మధ్య బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. మొన్నీమధ్య కుమారి ఆంటీ ఫుడ్ పై వీడియో చేసి వైరల్ అయ్యింది కీర్తి భట్. కుమారి ఆంటీ ఫుడ్ గురించి కీర్తి భట్ వీడియో చేసింది. కర్రీస్ లో కారం ఎక్కువ ఉందని కీర్తి భట్, ఆమె భర్త వీడియో చేశారు. దాంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. కీర్తిని, ఆమె భర్తను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో కీర్తిభట్, ఆమె భర్త క్లారిటీ ఇచ్చారు కూడా.. ఇక ఇప్పుడు మరోసారి కూడా వార్తల్లో నిలిచింది కీర్తిభట్. ఇప్పుడు ఈ చిన్నది సైబర్ నేరగాళ్ల బారిన పడింది. ఒక్క క్లిక్ తో రెండు లక్షలు పోగొట్టుకుందట కీర్తి భట్.

సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి భట్.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించింది. తన అందంతో పాటు ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కీర్తి. ఇక ఇప్పుడు ఈ చిన్నది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డానని తెలిపి షాక్ ఇచ్చింది. తాజాగా కీర్తిభట్ తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాను అని తెలిపింది. కొరియర్‌ కోసం ఓ లింక్‌ క్లిక్‌ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుందట.

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను షేర్ చేసింది కీర్తి. ఈ వీడియోలో తాను సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాను అని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఒక కొరియర్ రావాలి.. అయితే వారం రోజులు దాటిపోయినా కూడా అది రాలేదు. దాంతో నాకు ఒక ఫోన్ వచ్చింది. నా కొరియర్ మెహదీపట్నంలో ఉంది.. దాని అడ్రస్ అప్డేట్ కాలేదు అడ్రస్ మేసే చేయండి అని అన్నారు. దాంతో నేను ఓ వాట్సాప్ నెంబర్ కు అడ్రస్ పంపించా.. ఆతర్వాత నార్మల్ మెసేజ్ చేయమన్నారు. అయితే రెండు రూపాయిలు ఎక్స్ ట్రా కట్టాలి ఓ లింక్ పంపిస్తున్నాం అని చెప్పారు. సరే అని వాళ్లు చెప్పినట్టు ఆ లింక్ క్లిక్ చేస్తే రెండు రూపాయలు కట్ అయ్యాయి. సరేలే అనుకోని నేను షూటింగ్ కు వెళ్ళాను. సరిగ్గా అర్ధరాత్రి 12 సమయంలో 99 వేలు కట్ అయ్యాయి. ఆతర్వాత మరో 99 వేలు కట్ అయ్యాయి. దాంతో ఏం చెయ్యాలో అర్ధం కాక పోలీసులను ఆశ్రయించాం.. ఆ అకౌంట్స్ ను ట్రాక్ చేసి బ్లాక్ చేశాం.. అని పోలీసులు తెలిపారు. ఇంకా నా డబ్బులు తిరిగి రాలేదు కానీ కచ్చితంగా వస్తాయని పోలీసులు చెబుతున్నారు అని తెలిపింది కీర్తి భట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.