AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : వావ్..! ఎంతబాగున్నారో.. వైరల్ అవుతోన్న ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ వీడియో..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా పెరిగిపోయింది.ప్రస్తుతం బడా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకుంది.  సలార్ సినిమాతో దాదాపు ఆరేళ్ళ తర్వాత హిట్ అందుకున్నాడు డార్లింగ్. సలార్ సినిమా ఏకంగా 600 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

Prabhas : వావ్..! ఎంతబాగున్నారో.. వైరల్ అవుతోన్న ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ వీడియో..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2024 | 3:14 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా పెరిగిపోయింది.ప్రస్తుతం బడా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకుంది.  సలార్ సినిమాతో దాదాపు ఆరేళ్ళ తర్వాత హిట్ అందుకున్నాడు డార్లింగ్. సలార్ సినిమా ఏకంగా 600 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు సలార్ పార్ట్ 2 తెరకెక్కుతోంది. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్ సినిమా గుర్తుందా..? ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈశ్వర్ సినిమా మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటించిన హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించలేదు. తెలుగు, తమిళ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా రవితేజ హీరోగా నటించిన వీర సినిమాలో హీరో సిస్టర్ రోల్ లో కనిపించింది.

ఇదిలా ఉంటే శ్రీదేవి ఇప్పటికి కూడా అదే అందంతో ఆకట్టుకుంటున్నారు. వయసు పెరిగిన తరగని అందంతో కవ్విస్తున్నారు శ్రీదేవి. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఈ చిన్నది. పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఓ డాన్స్ షో కు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు శ్రీదేవి. ఇదిలా ఉంటే శ్రీదేవికి సంబందించిన ఓ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అమ్మడి వీడియోకు, ప్రభాస్ వీడియోను కలిపి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.