AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: అబ్బా సాయిరామ్.! మాధురికి ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిన రీతూ చౌదరి..

బిగ్‌బాస్ సీజన్ 9.. ఐదో వారం కెప్టెన్ గా కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసింది. ఇక ఈ వారం ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇంటిసభ్యులతోపాటు ప్రేక్షకులకు సైతం చిరాకు పుట్టిస్తున్నారు. మాట్లాడితే చాలు గొడవ పెట్టుకుందాం అని చూస్తున్నారు. అవసరం లేకపోయినా కల్పించుకుని మరీ గొడవలు సృష్టిస్తూ అటు ఇంటి సభ్యులతోపాటు.. ఇటు ప్రేక్షకులకు సైతం విసుగు తెప్పిస్తున్నారు.

Bigg Boss 9 Telugu: అబ్బా సాయిరామ్.! మాధురికి ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిన రీతూ చౌదరి..
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Oct 17, 2025 | 9:56 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9లో నిన్న రచ్చ కాస్త గట్టిగానే జరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో దివ్వెల మాధురికి, రీతూ చౌదరికి మధ్య వాదన జరిగింది. హౌస్ లో దివ్వెల మాధురి తెగ రూల్స్ పాస్ చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో.. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి మాట్లాడుకోండి.. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు.. గేమ్ ఆడటానికి వచ్చాం.. మార్నింగ్ కూడా మీరెవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్‌గా ఉండండి.. ఎవరూ ఎక్కడా మాట్లాడకండి.. మాకు నిద్రపట్టక చస్తున్నాం మేము.. నైట్ అంతా చాలా డిస్ట్రబింగ్‌గా ఫీలవుతున్నాం.. అంటూ రూల్స్ పాస్ చేసింది. దాంతో హౌస్ లో ఉన్న మిగిలినవారు షాక్ అయ్యారు. అయితే ఈ రూల్ అందరికి ఓకేనా అని ఇమ్మూ అందరిని అడిగాడు దానికి మాధురి మాట్లాడుతూ.. ఓకేనా ఓకేలేదా అనడానికి ఆప్షన్ ఏం లేదు అని పెద్ద మహారాణిలా రూల్స్ పాస్ చేసింది.

మాధురి కామెంట్స్ కు రీతూ చౌదరి రియాక్ట్ అయ్యింది. ఇదేమన్నా బిగ్ బాస్ రూలా .? అంటూ రీతూ కౌంటర్ వేసింది. దాంతో మాధురి రెచ్చిపోయింది. బిగ్ బాస్ రూలా అంటున్నావేంటీ.. గొడవపడదామనుకుంటున్నారా.? అని మాధురి రీతూ మీదఅరిచింది. దాంతో అరవకండి ఎందుకు అరుస్తున్నారు.. మీకేమైనా ప్రాబ్లం ఉందా.? అని రీతూ కూడా సీరియస్ అయ్యింది. దాంతో అవును నాకు ప్రాబ్లమ్ ఉంది. నాకు బీపీ ఉంది అరుస్తా అని మాధురి అనడంతో.. వెళ్లి ట్యాబ్లేట్ వేసుకోండి అని రీతూ కౌంటర్ వేసింది.  దాంతో మధురికి మరింత కాలింది.

మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు.. మీతో నేను మాట్లాడానా.. బిగ్‌బాస్ రూలా అని అడిగాను.. అని రీతూ చెప్పింది. దీనికి అవును రూల్‌యే..అంటూ మాధురి రెచ్చిపోయింది. లైట్స్ ఎందుకు ఆపుతున్నారు.. అంటూ మాధురి ప్రశ్నించింది. దానికి మేము మాట్లాడుకుంటాం అలాంటి రూల్ ఏం లేదు ఇక్కడ అని రీతూ అనగానే మాధురికి మరింత మండింది. దీంతో నేను ఒప్పుకోను.. అని మాధురి.. మీరెవరండీ ఒప్పుకోకపోవడానికి అని రీతూ మాటల యుధం చేశారు. నా హెల్త్ నా హెల్త్ ఇది అని మాధురి అంటే.. అయితే మీరు మూడింటివరకూ ఎందుకుపడుకోలేదు అని రీతూ.. ప్రశ్నించింది. మీరు పాడుకోనివ్వడం లేదుగా అని మాధురి చెప్పుకొచ్చింది. చూడండి లైట్స్ ఆపిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి లేదు.. ఎందుకు ఆపుతున్నాడు లైట్స్ బిగ్‌బాస్.. ఊరుకే ఆపుతున్నాడా.. బిగ్‌బాస్ రూల్ ఉందా అని అడగడమేంటి.. అని మళ్లీ మొదటికొచ్చింది మాధురి. దాంతో రీతూ మరింత రెచ్చిపోయింది. దీంతో మీరెవరు అది చెప్పడానికి అంటూ సీరియస్ అయ్యింది రీతూ.. మీరు చెప్పిన మాట వినడానికి నేను రాలేదు.. అని రీతూ అంటే అయితే వినకు వెళ్లు అని మాధురి అంది దానికి నేను ఎక్కడికి వెళ్ళాను కావాలంటే మీరే పోండి అని రీతూ రివర్స్ అయ్యింది. నేను ఎక్కడికీ పోను.. నా ఇష్టమొచ్చినట్లు అరుస్తాను.. చిరాకుగా ఉంటే బయటికి వెళ్లు.. అని మాధురి చెప్పింది. మేము కూడా అలానే నైట్ మాట్లాడతాం.. మీకు చిరాకుగా ఉంటే మీరూ బయటికెళ్లి పడుకోండి అని రీతూ కూడా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఏయ్ ఎక్కువ మాట్లాడకు.. అని మాధురి రెచ్చిపోయింది. ఆ మాటలకూ రీతూకి కాలింది.. ఏయ్ గియ్ అంటే పడటానికి ఎవరూ లేరు ఇక్కడ.. నా ఇష్టం నేను నవ్వుకుంటాను.. మాట్లాడతాను అని సీరియస్ గా చెప్పింది. ఏం మాట్లాడుతున్నావ్ .. అని మాధురి అంటుంటే తెలుగు మాట్లాడుతున్నాను.. అంటూ రీతూ సెటైర్ వేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే