AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : అత్యంత భయంకరమైన వెబ్ సిరీస్.. ఒక్కో సీన్ చూస్తే వణుకే.. రాత్రిపూట ఒంటరిగా అస్సలు చూడకండి..

సాధారణంగా హారర్ వెబ్ సిరీస్, సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని హారర్ సినిమాలు గుండెల్లో వణుకు పుట్టించినప్పటికీ ఒంటరిగా చూసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ మాత్రం రాత్రిళ్లు ఒంటరిగా అస్సలు చూడొద్దు. ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఈ సిరీస్ అత్యంత భయంకరమైన సిరీస్ గా వార్తలలో నిలిచింది.

Cinema : అత్యంత భయంకరమైన వెబ్ సిరీస్.. ఒక్కో సీన్ చూస్తే వణుకే.. రాత్రిపూట ఒంటరిగా అస్సలు చూడకండి..
Cinema (2)
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2025 | 9:48 PM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో విభిన్న కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ జానర్ చిత్రాలతోపాటు హారర్ కంటెంట్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి ఎక్కువగా హారర్ సినిమాలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ వెబ్ సిరీస్ అత్యంత భయంకరమైనది. ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ అవుతుంది. ఆ సిరీస్ పేరు ఖౌఫ్. ఇది ఇప్పుడు ప్రేక్షకులను వణికిస్తోంది. ఈ సిరీస్ కథ.. ఢిల్లీలోని ఒక బాలికల హాస్టల్లోని 333 గది చుట్టూ తిరుగుతుంది. గ్వాలియర్ నుంచి ఢిల్లీకి చదువుకోవడానికి వచ్చిన ఒక యువతి అదే గదిలో ఉంటుంది. అయితే ఆ గది ఓ దుష్ట శక్తి నీడలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

అయితే మొదటి రోజే అక్కడే ఉన్న అమ్మాయిలు తనను వెళ్లిపోమ్మని హెచ్చరిస్తారు. కానీ అదేం పట్టించుకోకుండా ఆ యువతి 333 గదిలోనే ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ గదిలో విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఆ గదిలో జరిగే భయానక సంఘటనలను చూసిన తర్వాత ప్రేక్షకులు వణికిపోతుంటారు. ఈ ఖౌప్ సిరీస్ ను స్మితా సింగ్ రచించగా, పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఇందులో మోనికా పన్వర్, ప్రముఖ నటుడు రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి, అభిషేక్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మ్యాచ్‌బాక్స్ షాట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ తో ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

ప్రస్తుతం ఈ ఖౌఫ్ సిరీస్ కు IMDBలో 7.1 రేటింగ్ ఉంది. అలాగే ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భయాంకరమైన థ్రిల్ తో హారర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..