Bigg Boss: అందరి ముందే భార్య కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్.. ఎందుకంటే? వీడియో
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో క్రేజ్ తెచ్చుకున్న వారిలో మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ ఒకడు. ప్రపంచం ఏమైపోయినా తనకు నచ్చినట్లు ఉంటాననే ఈ డిఫరెంట్ క్యారెక్టర్ బిగ్ బాస్ షోలో కామన్ మ్యాన్ గా అడుగు పెట్టాడు. కానీ తన ఓవర్ ఆటి ట్యూడ్ తో ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ క్యాటగిరీలో కొందరు సామాన్య వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు. అలా కామన్ మెన్ జాబితాలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినటువంటి వారిలో మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ ఒకరు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్ట్ ఇతని పేరు తెగ మార్మోగిపోయింది. ముఖం కనిపించకుండా మాస్క్ తోనే ఈ కాంటెస్ట్ లోకి అడుగు పెట్టాడు హరీష్. తన భార్య మీద ఎంతో ఇష్టమైన ప్రేమ, గౌరవం ఉన్న నేపథ్యంలో తన భార్య పేరును తన పేరు పక్కన పెట్టుకొని హరిత హరీష్ గా మార్చుకున్నానంటూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సమయంలో బయట పెట్టాడీ మాస్క్ మ్యాన్. అయితే ఒకసారి తనకు కోపం వచ్చి తన భార్యపై చేయి చేసుకున్నాననే విషయాన్ని కూడా బయట పెట్టాడు హరీష్. దీంతో అతనిపై తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. ఆ వ్యతిరేకతతోనే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు హరీష్. అయితే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన మాస్క్ మ్యాన్ పెద్దగా బయట కనిపించలేదు. అలాగే ఏ టీవీ షోలోనూ పార్టిసిపేట్ చేయలేదు. అయితే ఇప్పుడు మరో టీవీ ప్రోగ్రామ్ లో కనిపించనున్నాడు హరిత హరీష్.
ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం కాబోతున్న మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కార్యక్రమంలో తన భార్య హరితతో కలిసి పాల్గొనబోతున్నాడు హరీష్. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హరీష్ అందరి ముందు తన భార్య కాళ్లు పట్టుకొని తనకు క్షమాపణలు కోరాడు. ‘మగాడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయి ఎత్తడం చాలా తప్పు’ అంటూ ఓ సందేశం కూడా ఇచ్చాడు మాస్క్ మ్యాన్. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఈ టీవీ ప్రోగ్రామ్ మార్చి 15 నుంచి స్టార్ మా లోను అలాగే జియో హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది.
బిగ్ బాస్ రియాలిటీ షో తరహాలోనే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్ ఉండబోతుందని తెలుస్తోంది. ఎక్కువగా బుల్లితెర జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. సుమారు పది వారాల పాటు సాగే ఈ కార్యక్రమానికి నటి లయతో పాటు సీనియర్ హీరోయిన్ రాధ, డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. . అలాగే శ్రీముఖి యాంకర్ గా చేయనుంది.ఔ
వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




