Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో పానిపట్టు యుద్ధం.. రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్స్

ఒకొక్క టీమ్ లో ఉన్న సభ్యులందరి కాళ్లకు కలిపి ఒక బోర్డు కట్టారు. అలా అందరూ స్కెటింగ్ చేస్తున్నట్టు ముందుకు కదులుతూ.. మంచు మనిషిని తయారు చేయాలి.. స్నో మ్యాన్‌ను ముందుగా ఎవరు పూర్తి చేస్తారో వారు విన్ అయినట్టు అని తెలిపాడు బిగ్ బాస్.

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో పానిపట్టు యుద్ధం.. రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్స్
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 30, 2024 | 7:36 AM

బిగ్ బాస్ హౌస్ లో ఇక పై ఒకటే క్లాన్ ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇక పై రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ లు ఉండవు.. ఒకే ఒక్క క్లాన్ మెగా క్లాన్.. అదే బీబీ క్లాన్ ఉంటుంది అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అలాగే ఆ క్లాన్ లోనే నాలుగు టీమ్స్ ఉంటాయని తెలిపాడు. అలాగే ఈ నాలుగు టీమ్ లకు నలుగురు లీడర్లు ఉంటారని తెలిపాడు. అలాగే ఈ నాలుగు టీమ్ లకు రకరకాల గేమ్స్ ఆడించాడు. ఇక టాస్క్ లో  భాగంగా ప్రతి టీమ్ లో ముగ్గురు ఉంటారు. టీమ్ రెడ్: గౌతమ్, ప్రేరణ యష్మీ.. టీమ్ బ్లూ: అవినాష్ నిఖిల్ హరితేజ.. టీమ్ గ్రీన్: తేజ, విష్ణుప్రియ, నబీల్.. టీమ్ ఎల్లో:  రోహిణి, పృథ్వీ, నయని.. ఉన్నారు. అలాగే అందరిని డిసైడ్ అయ్యి గంగవ్వను ఎదో ఒక టీమ్ లోకి తీసుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక ఈ నాలుగు టీమ్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో భాగంగా ముందుగా.. ఒకొక్క టీమ్ లో ఉన్న సభ్యులందరి కాళ్లకు కలిపి ఒక బోర్డు కట్టారు. అలా అందరూ స్కెటింగ్ చేస్తున్నట్టు ముందుకు కదులుతూ.. మంచు మనిషిని తయారు చేయాలి.. స్నో మ్యాన్‌ను ముందుగా ఎవరు పూర్తి చేస్తారో వారు విన్ అయినట్టు అని తెలిపాడు బిగ్ బాస్. అలాగే గెలిచిన టీమ్ లీడర్‌కి రెండు డైస్‌ను రోల్ చేసే అవకాశంతో పాటు ఓడిపోయిన మిగిలిన టీమ్ నుంచి ఒక టీమ్‌కి ఎల్లో కార్డ్ ఇచ్చే అవకాశం లభిస్తుంది. ఎల్లో కార్డ్ వస్తే .. ఆ టీమ్ లీడర్ తన టీమ్ నుంచి ఒక సభ్యుడ్ని ఆట నుంచి తప్పించాల్సి ఉంటుంది.

ఇక ఈ టాస్క్ కు గంగవ్వను సంచలక్ గా ఉంచాడు బిగ్ బాస్. ఈ గేమ్‌లో టీమ్ బ్లూ విన్ అయింది. దాంతో టీమ్ రెడ్ కు ఎల్లో కార్డు ఇచ్చారు. అలాగే డైస్ ను రోల్ చేసే అవకాశం కూడా వచ్చింది. దాంతో హరితేజ రెండు సార్లు డైస్ ను రోల్ చేసింది. ఒకసారి 6 మరోసారి 3 వచ్చింది. దాంతో 6 పాయింట్స్ తాను తీసుకొని 3 అవినాష్ కి ఇచ్చింది హరితేజ. ఎవరు గెలిచినా ఎల్లో కార్డ్ బ్లూ టీమ్‌కే ఇద్దామని యష్మీ మిగిలిన టీమ్ మెంబర్స్ తో చెప్పింది. ఆ తర్వాత పానిపట్టు యుద్ధం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో మూడు వాటర్ ట్యంక్స్ ఉంచి అందులో నీళ్లు తగ్గకుండా చూసుకోవాలి అని చెప్పాడు. బజార్ మోగినప్పుడు మిగిలిన టీమ్స్ నుంచి ఇద్దరు వచ్చి మిగిలిన టీమ్ వాళ్ళ ట్యంక్ లో నీరు తగ్గించే ప్రయత్నం చేయాలి. బజార్ కి , బజార్ కి మధ్యలోనే నీరు తగ్గించే ప్రయత్నం చేయాలి. బజార్ మోగగానే  ఎవరో గ్రీన్ లైన్ దాటుతారో వారికే అవకాశం ఉంటుంది. చివరిగా ఎవరి ట్యంక్ లో నీళ్లు తక్కువ ఉంటే వాళ్ళు ఓడిపోయినట్టు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ గేమ్‌కి కూడా గంగవ్వ సంచాలక్. ముందుగా బజార్ మోగగానే నబీల్ నిఖిల్‌ లైన్ దాటారు. వాళ్లకు నచ్చిన టీమ్ వాటర్ తగ్గించే ప్రయత్నం చేశారు. ఆతర్వాత బజార్ మోగగానే పృథ్వీ.. నబీల్‌కి ఛాన్స్ వచ్చింది. అయితే బజార్ పూర్తయిన తర్వాత బ్లూ టీమ్ ప్లగ్గులు విసిరేశాడు పృథ్వీ. దాంతో నిఖిల్ , పృథ్వీ మధ్య గొడవ జరిగింది. పృృథ్వీ గౌతమ్‌కి ఛాన్స్ వచ్చింది. అతను బ్లూ టీమ్ ను టార్గెట్ చేశాడు ఫైనల్ గా బ్లూ టీమ్ ఓడిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!