Pallavi Prashanth: ఇన్ స్టాలో పేరు మార్చిన పల్లవి ప్రశాంత్.. ‘స్పై’ టీం గుర్తుగా బిగ్బాస్ విజేత..
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడి ఘటనలో అతడిని A1గా.. అతడి సోదరుడు మనోహర్ A2గా పేర్కొంటూ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్, అతడి సోదరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు ప్రశాంత్ తరపు న్యాయవాది. ఈ మేరకు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.
రైతు బిడ్డ, బిగ్బాస్ సీజన్ 7 విజేత పల్లివి ప్రశాంత్కు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడి ఘటనలో అతడిని A1గా.. అతడి సోదరుడు మనోహర్ A2గా పేర్కొంటూ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్, అతడి సోదరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు ప్రశాంత్ తరపు న్యాయవాది. ఈ మేరకు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఈరోజు ప్రశాంత్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రశాంత్కు బెయిల్ రావడానికి ఎంతో ప్రయత్నించాడు సింగర్ భోలే షావలి. రైతు బిడ్డను విడిపించేందుక కర్త కర్మ క్రియ అన్ని అయ్యాడు పాటబిడ్డ. కేవలం 48 గంటల్లోనే బెయిల్ రావడంలో కీలకపాత్ర పోషించాడు సింగర్ భోలే.
ఇదిలా ఉంటే.. తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్ స్టాలో పేరు మారింది. ఇప్పటివరకు కేవలం పల్లవి ప్రశాంత్ అని మాత్రమే కనిపించింది. కానీ ఇప్పుడు బయోలో మార్పులు జరిగాయి. Malla Ochina, SPY Team Winner అని కొత్తగా తన ఇన్ స్టాలో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతడి మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ విన్నర్ కావడంలో శివాజీ పాత్ర ఎంతో ఉంది. మొదటి వారం నుంచి అతడికి వెన్నంటే ఉంటే ధైర్యమందించాడు శివాజీ. బిగ్బాస్ సీజన్ 7లో శివాజీ, యావర్, ప్రశాంత్ ముగ్గురి బాండింగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. SPY టీంకు ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ కు ఇన్ స్టాలో 1 మిలియన్ కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.
View this post on Instagram
ప్రశాంత్ ఈరోజు బెయిల్ పై విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అతడికి 15 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ప్రశాంత్ అరెస్ట్ కావడం పై బిగ్బాస్ కంటెస్టెంట్స్ స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలిచారు. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే జరిగిన రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ గొడవపడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు ఈ ఘటనలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే ఆ వెంటనే ర్యాలీ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాడు. దీంతో అతడితోపాటు మరో నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.