Bigg Boss 7 Telugu: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఈసారి ఊహించని ఎలిమినేషన్
నిన్నటి ఎపిసోడ్ తో ఆటగాళ్లు మూడు, పోటుగాళ్ళు మూడు పాయింట్స్ తో సమానంగా ఉన్నారు. ఇక నామినేషన్స్ లో ఈ వారాం ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. శోభా శెట్టి, అమర్ దీప్, యావర్, తేజ, నయని పావని, పూజమూర్తి, అశ్విని నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుందని తెలుస్తోంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళు అంటూ రెండు టీమ్ డివైడ్ చేసి గేమ్స్ అడిస్తున్నాడు బిగ్ బాస్. పాట హౌస్ మేట్స్ ను ఆటగాళ్లుగా అలాగే కొత్త హౌస్ మేట్స్ ను పోటుగాళ్లుగా డివైడ్ చేసి గేమ్స్ అందిస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ తో ఆటగాళ్లు మూడు, పోటుగాళ్ళు మూడు పాయింట్స్ తో సమానంగా ఉన్నారు. ఇక నామినేషన్స్ లో ఈ వారాం ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. శోభా శెట్టి, అమర్ దీప్, యావర్, తేజ, నయని పావని, పూజమూర్తి, అశ్విని నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుందని తెలుస్తోంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరు అంటే. బిగ్ బాస్ లో పాత హౌస్ మేట శోభా శెట్టి ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
శోభ శెట్టి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఆమె గేమ్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఆమె ఆట తీరు నచ్చక పోవడంతో ఆమెకు తక్కువ ఓటింగ్ పడిందని తెలుస్తోంది. ఇక మొదటి నుంచి హౌస్ లో ఉన్నవారితో గొడవలు పడుతూ లేనిపోని వాటికి కూడా అరిచి గోల చేస్తుండటంతో ప్రేక్షకులు ఆమె పై విమర్శలు చేస్తున్నారు.
నిన్నటి ఎపిసోడ్ లో కూడా శోభ శెట్టి మరోసారి తన విలనిజం చూపించింది. గేమ్ రాంగ్ గా ఆడుతూ గౌతమ్ తో గొడవ పడింది. ఇది నా స్ట్రాటజీ అంటూ అరిచి గోల చేసింది. ఇక ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఆమెతోపాటు కొత్తగా హౌస్ లోకి వచ్చిన పూజమూర్తి కూడా ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు. అలాగే ఆమె హౌస్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ వారం ఎలిమినేషన్ లో పూజ మూర్తి కూడా డేంజర్ జోన్ లో ఉందని తెలుస్తోంది. కానీ శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు చూడాలి మరి ఏం జరుగుతుందో.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
