Bigg Boss 7 Telugu: మొత్తానికి గౌతమ్ బాబు ఇరగదీశాడుగా.. శోభా, అమర్ మధ్య చిచ్చు పెట్టిన గేమ్
బిగ్ బాస్ హౌస్ లో నాలుగో పవర్ అస్త్ర సాదించేందుకు నిన్న హౌస్ లోఉన్న వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగో పవర్ అస్త్ర సాధిస్తే రెండు వారల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. ఈ పవర్ అస్త్ర సాధించే కంటెండర్స్ గా ఉండటానికి బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడాలని..చెప్పాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో తేజ, గౌతమ్, శుభ శ్రీ, రతికా, ప్రియాంక ఉన్నారు. వీరి నుంచి ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో నాలుగో పవర్ అస్త్ర సాదించేందుకు నిన్న హౌస్ లోఉన్న వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగో పవర్ అస్త్ర సాధిస్తే రెండు వారల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. ఈ పవర్ అస్త్ర సాధించే కంటెండర్స్ గా ఉండటానికి బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడాలని..చెప్పాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో తేజ, గౌతమ్, శుభ శ్రీ, రతికా, ప్రియాంక ఉన్నారు. వీరి నుంచి ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఇక నిన్న బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్‌లో ముందుగా హౌస్ ను బ్యాంక్ గా మార్చారు. హౌస్ లో ఉన్న వారిలో బ్యాంకర్లు గా శివాజీ, శోభ, సందీప్ లకు కొన్ని కాయిన్స్ ఇచ్చి. అవి తమకు నచ్చిన మెంబర్స్ కు ఇవ్వమన్నారు ఆ తర్వాత ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో లెక్కబెట్టి వాటిని తమ లాకర్లు లో దాచాలని చెప్పారు. ఆతర్వాత ఆడే గేమ్స్ ను బట్టి తమ దగ్గరున్న కాయిన్స్ పెంచుకోవడం లేదా తగ్గిపోవడం జరుగుతుందనిచెప్పాడు బిగ్ బాస్ దాంతో అందరు బ్యాంకర్లను బ్రతిమిలాడుకునే పనిలో పడ్డారు. ఆతర్వాత ఏటీఎమ్ దగ్గర ఉన్న బజర్‌ను ఫస్ట్ ఎవరు ప్రెస్ చేస్తే. బారు తన పార్టనర్‌తో పాటు, ఆపోజిట్ జంటను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఆతర్వాత బిగ్ బాస్ ఇచ్చే గేమ్ ఆడాల్సి ఉంటుంది.
ముందుగా అమర్ దీప్ బజార్ ప్రెస్ చేశాడు. దాంతో అతను తన పార్టనర్ గా గౌతమ్ ను ఎంచుకున్నాడు. అపోజిట్ టీమ్ గా రతికా, తేజలను ఎంచుకున్నాడు. వీరికి ఓ టాస్క్ ఇచ్చాడు. గేమ్ ఏంటంటే.. ఒక జంట నవ్వుతూ ఫొటోలు దిగకుండా మరో టీమ్ అడ్డుకోవాలి. అలా ఎక్కువ స్మైల్ ఫొటోస్ ఏ జంట దిగుతుందో వాళ్లు విన్ అవుతారని చెప్పాడు. ఈ గేమ్‌లో రెండు జంటలు గట్టిగానే ఆడాయి. రతికా, తేజ అమర్ గౌతమ్ లను బాగానే అడ్డుకున్నారు.
ఈ గేమ్ లో ఫొటోగ్రాఫర్‌గా శివాజీ, సంచలక్ గా సందీప్ ఉన్నారు. శోభా ప్రతి ఫొటోను పరిశీలించి ఎవరు విన్ అయ్యారో తెలిపింది. ఈ గేమ్ లో అమర్ దీప్ గౌతమ్ విన్ అయ్యారు. అంతకు ముందు శోభా శెట్టికి , అమర్ కు మధ్య గొడవ జరిగింది. బాక్స్ లో ఉండి ఫోటోలు దిగాలి అని శోభా.. బాక్స్ దగ్గర ఉండి ఫోటోలు దిగాలి అని అమర్ ఇద్దరు కాసేపు గొడవ పడ్డారు. ఓడిపోయిన జంట దగ్గర ఉన్న కాయిన్స్ గెలిచిన జంట పంచుకుంది. మొత్తంగా అమర్, గౌతమ్ బాగా ఆడారు ముఖ్యంగా గౌతమ్ ఈసారి సత్తా చాటాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.