Bigg Boss 6: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా.. సూపర్ ట్వీట్స్ గురూ..
ఫైనల్ పోటీ ఎవరి మధ్య ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రేక్షకుల మధ్య ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న చర్చ. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 మరి కొద్దీ రోజుల్లో కంప్లీట్ కానుంది. ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టాప్ 5లో ఎవరు ఉంటారు. ఫైనల్ పోటీ ఎవరి మధ్య ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రేక్షకుల మధ్య ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న చర్చ. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. అయితే ఈ వారం కూడా ఎప్పటిలానే ఊహించని ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది. అలాగే ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు. రేవంత్, శ్రీసత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్, ఫైమా.. ఉన్నారు. ఇనాయ కెప్టెన్ కాబట్టి ఈ వారం ఆమె ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యింది. అలాగే శ్రీహాన్ కూడా ఈ వారం ఎలిమినేషన్ లో లేడు. కాబట్టి రేవంత్, శ్రీసత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్, ఫైమా లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే..
ఇక వీరికి ప్రేక్షకులు ఓటింగ్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఓటింగ్ లో రేవంత్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. రేవంత్ ను ఎలిమినేషన్ నుంచి సేఫ్ చేయడానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున్న ఓట్లు వేస్తున్నారు. అలాగే సెకండ్ ప్లేస్ లో రోహిత్ ఉన్నాడు అని తెలుస్తోంది.
అయితే లీస్ట్ ప్లేస్ లో ఫైమా ఉందని తెలుస్తోంది. కామన్‌మేన్ కోటాలో హౌస్‌లోకి వచ్చిన ఆదిరెడ్డి మూడో స్థానంలో ఉండగా.. కీర్తి నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో శ్రీసత్య ఉందని తెలుస్తోంది. ఫైమా-శ్రీసత్య మధ్య గట్టి పోటీ జరిగిందని తెలుస్తోంది. ఫైనల్ గా ఫైమా అవుట్ అయ్యిందని తెలుస్తోంది.