Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యది ఆ కంటెస్టెంటే..

ఆదివారం వచ్చిందంటే అందరిలోనూ టెన్షన్ మొదలవుతుంది. హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరు ఎలిమినేట్ అంటారా అని ఆసక్తిగా చూస్తుంటారు.

Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యది ఆ కంటెస్టెంటే..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 05, 2021 | 4:07 PM

Bigg Boss 5 Telugu: ఆదివారం వచ్చిందంటే అందరిలోనూ టెన్షన్ మొదలవుతుంది. హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరు ఎలిమినేట్ అంటారా అని ఆసక్తిగా చూస్తుంటారు. ఇక బిగ్ బాస్ గేమ్ షో చివరి దర్శకు వచ్చేసింది.మరో రెండు వారాల్లో షో ముగియనుంది. దాంతో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఎలిమినేషన్ జరగనుంది. ముందుగా హౌస్ లో ఉన్న అందరితో ఆటలాడించి నవ్వులు పూయించిన తర్వాత నాగ్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతాడు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ హౌస్ మేట్ అంటూ ఆవార్త చక్కర్లు కొడుతుంది. ఈ రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో ఊహించని ఎలిమినేషన్ జరగనుందని తెలుస్తుంది.

బిగ్‌బాస్ సీజ‌న్ 5 13వ వారం ఎలిమినేష‌న్‌కు చేరుకుంది. మాన‌స్‌, కాజ‌ల్‌, పింకీ, సిరిల‌లో ఎవ‌రు ఎలిమినేట్ కాబోతున్నార‌నే దానిపై మ‌రి కొన్ని గంట‌ల్లో అఫిషియ‌ల్‌గా ఓ క్లారిటీ రానుంది. అయితే నెట్టింట మాత్రం ప్రియాంక సింగ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఈ సారి ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి స్ట్రాంగ్ కాంటెసస్టెంట్ గా గేమ్ ఆడుతున్న ప్రియాంక ఈ వారం ఎలిమినేట్ అవ్వనుందని తెలుస్తుంది. ఈ వారం పింకీకి ఓట్లు తక్కువగా పడ్డాయని తెలుస్తుంది. ఇప్ప‌టికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ టాప్ 5లో చేరుకోవ‌డం కోసం త‌మ‌దైన రేంజ్‌లో ప్రాణం పెట్టి హండ్రెడ్ ప‌ర్సెంట్‌ గేమ్ ఆడేస్తున్నారు.ఇప్ప‌టికే టికెట్ టు ఫినాలేకు ముందుగా శ్రీరామ‌చంద్ర చేరుకున్నాడు. ఈ వారం కాకుండా వ‌చ్చే వారం మ‌రో ఎలిమినేష‌న్ ఉంటుంది. మరి విన్నర్ ఎవరవుతారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: ‘అఖండ’పై అన్షుల్ సక్సేనా ప్రశంసలు.. ‘జై బాలయ్య’ అని కామెంట్..

Pushpa Movie: పుష్ప మేకింగ్‌ వీడియోను చూశారా.? బన్నీ ఇచ్చిన మెసేజ్‌ మాత్రం అదుర్స్‌..

Akira Nandan: తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..