Bigg Boss 5 Telugu: టాప్ 5 లిస్ట్‌లో మొదటి కంటెస్టెంట్ ఎవరో తెలుసా..? ఆసక్తికర పోరులో విన్ అయ్యింది అతడే..
బిగ్ బాస్ చివరి అంకానికి త్వరలోనే చేరనుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని అంతా ఆసక్తిగా ఎరురుచుస్తున్నారు..
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ చివరి అంకానికి త్వరలోనే చేరనుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని అంతా ఆసక్తిగా ఎరురుచుస్తున్నారు..ఇక రోజు రోజుకు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు, వాటిలో విన్ అవ్వడానికి హౌస్ మేట్స్ పడుతున్న కష్టాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే పోటీదారులు సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్‌లకు ఫోకస్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.. నలుగురికి నాలుగు పలకలు ఇచ్చి.. వివిధ రకాల సౌండ్స్ వినిపించేవారు.. ఆ సౌండ్స్‌ని విని అవి వేటికి సంబంధించినవో రాయాలి అని చెప్పాడు బిగ్ బాస్. కాజల్ సన్నీకి.. షణ్ముఖ్ సిరికి.. ప్రియాంక శ్రీరామ్‌కి హెల్ప్ చేస్తూ కనిపించారు దీంతో బిగ్ బాస్ వాళ్లని హెచ్చరించాడు.
సౌండ్స్ స్టార్ట్ అయిన తరువాత సైగలు చేస్తూ ఉండటంతో సన్నీ కాజల్‌పై సీరియస్ అయ్యాడు. ఇది టికెట్టు ఫినాలే మచ్చా మజాకా కాదు.. నువ్వు ఇక్కడ ఉండకు అంటూ సీరియస్ అయ్యాడు. సిరి.. తొండి గేమ్ ఆడుతూ కనిపించింది.. బిగ్ బాస్ బోర్డ్‌లు చూపించండి అని చెప్పిన తర్వాత పక్కవాళ్ళ పలక చూసి రాసింది. దాంతో బిగ్ బాస్ రాసింది చెరిపేయాలని అన్నాడు. అయితే కాజల్ మాత్రం సౌండ్ వచ్చినప్పుడల్లా ఆన్సర్స్ చెప్పేస్తుంది.. దాంతో శ్రీరామ్ కూడా సీరియస్ అయ్యాడు. సన్నీ, శ్రీరామ్ ఎంత చెప్పిన కాజల్ వినలేదు. నేను మాట్లాడతా.. బరాబర్ మాట్లాడతా.. బిగ్ బాస్ మాట్లాడొద్దని చెప్పలేదు.. చెప్పొద్దని అన్నారంతే.. మీరు గేమ్‌లో ఉంటే నేను ఆడొద్దా.. అంటూ వాదించింది. ఈ టాస్క్‌లో ఏడు సీక్వెన్స్‌లను కరెక్ట్‌గా రాసిన మానస్-సన్నీలు విన్ కాగా.. సిరి, శ్రీరామ్‌లు ఈ టాస్క్‌లో వెనకబడ్డారు. అయినప్పటికీ మొత్తం నాలుగు టాస్క్‌ల స్కోర్‌ని బట్టి మానస్ 25 పాయింట్లతో తొలి స్థానంలో ఉంటే.. శ్రీరామ్ 21 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. సిరి 19 పాయింట్లతో మూడో స్థానం.. సన్నీ 17 పాయింట్లతో ఉన్నారు. మొత్తంగా ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి మానస్ 29 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 28 పాయింట్లతో శ్రీరామ్ రెండో స్థానంలో.. 24 పాయింట్లతో సిరి మూడో స్థానంలో .. 23 పాయింట్లతో సన్నీ నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో సన్నీ, సిరి టికెట్ టు ఫినాలే పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చివరకు మానస్, శ్రీరామ్ నిలిచారు. బరువైన బ్యాగ్‌కి తాడు కట్టి.. దాని సాయంతో కింద ఉన్న బ్లేట్స్‌ని ఇరగ్గొట్టుకుంటూ రావాల్సి ఉంది.. అయితే మానస్ బ్యాగ్ కడ్డీలో ఇరుక్కుని పోవడంతో శ్రీరామ్ ఈ టాస్క్‌లో గెలిచి టికెట్ టు ఫినాలే అందుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :