Akhanda 2 : అఖండ 2 నిర్మాతలకు ఊరట.. టికెట్ ధరలపై పెంపుపై హైకోర్టు నిర్ణయం ఇదే..

భారీ అంచనాల మధ్య శుక్రవారం (డిసెంబర్ 12న) అడియన్స్ ముందుకు వచ్చింది అఖండ 2. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఉదయం నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు తాజాగా ఈ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Akhanda 2 : అఖండ 2 నిర్మాతలకు ఊరట.. టికెట్ ధరలపై పెంపుపై హైకోర్టు నిర్ణయం ఇదే..
Akhanda 2

Updated on: Dec 12, 2025 | 5:44 PM

అఖండ 2 సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ మూవీ పై గురువారం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14 వరకూ డివిజన్ బెంచ్ స్టే ఇస్తూ తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా అఖండ 2. మొదటి నుంచి ఈ సినిమా విడుదలపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. నిర్మాతల ఫైనాన్షియల్ సమస్యల కారణంగా వాయిదా పడింది. అన్ని సమస్యలు తొలగిన తర్వాత డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..

అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ.. టికెట్స్ రేట్స్ సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. టికెట్ పై అదనంగా రూ.600 పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీనిపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీవోను హైకోక్టు రద్దు చేసింది. అలాగే ఫిలిం డెవల్మెంట్ కార్పొరేషన్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై నిర్మాతలు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..

శుక్రవారం దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఆర్డర్స్ పై ఈనెల 14 వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. మరోవైపు ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..

ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..