Personality Test: మీ ముక్కు ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
ఒక వ్యక్తి ఎలాంటి వాడు, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవాలంటే వారితో కొద్ది సేపు మాట్లాడితే అర్థం అవుతుంది. కానీ ఇలా మాట్లాడకుండా కూడా ఒక మనిషి వ్యక్తితం తెలాంటిదో తెలుసుకోవచ్చంటున్నారు మానసిక నిపుణులు. అవును హస్తముద్రికం ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలాగైతే అంచనా వేస్తారో.. అలానే ఒక వ్యక్తి శరీర భాగాల ఆకారాన్ని బట్టి కూడా వారి వ్యక్తత్వం ఎలాంటిదో తెలుకోవచ్చని చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం. ముక్కు ఆకారాన్ని బట్టి ఒక వ్యక్తి లక్షణాలను, వ్యక్తిత్వాన్ని అంచనావేయవచ్చట. కాబట్టి ముక్కు ఆకారం ప్రకారం మీరు ఎలాంటి వ్యక్తియో ఇక్కడ తెలుసుకోండి.
Updated on: Dec 12, 2025 | 5:44 PM

వంకర ముక్కు ఉన్నవారు: ఒక వ్యక్తి ముక్కు వంకరగా ఉంటే.. వారు వీరు చాలా సాధారణమైన, నిజాయితీ గల వ్యక్తులు అని అర్థం. అలాగే వీరు బలమైన వ్యక్తిత్వం కలిగిన వారని.. వీళ్లు ఇతరులను ఈజీగా అర్థం చేసుకుంటారు. అలాగే వీరు విలువలకు కట్టుబడి ఉండడంతో పాటు ఇచ్చిన మాట తప్పకుండా ఉంటారు.

స్ట్రెయిట్ ముక్కు: ముక్కు కనుబొమల మధ్య నుంచి చివరి స్ట్రెయిట్‌గా ఒకేలా ఉంటే వీరు ఎంతో సహనం, దయ, క్రమశిక్షణ, నమ్మకం కలిగిన వ్యక్తులని అర్థం. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. వీరికి ఇష్టమైన వ్యక్తులతోనే ఎక్కువగా గడుపుతారు. వీరు ఇంట్రోవర్ట్‌గా ఉండాలని అనుకుంటారు. తమ రహస్యాలను ఎవరికి చెప్పడానికి ఇష్టపడతారు. అలాగే వీళ్లు ఎప్పుడు ప్రాంశంతగా ఉంటారు. పక్కవాళ్లను అంత ఈజీగా అస్సలు నమ్మరు.

లావు ముక్కు: ముక్కు లావుగా ఉన్న వ్యక్తులు చాలా స్పీడ్‌గా ఉంటారు. వీళ్లు ప్రతి విషయంలో యాక్టీవ్‌గా ఉంటారు. వీళ్లు చాలా తెలివైనవారు. అలాగే వీళ్లు దయాగుణం, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే ఈ వీరిలోని ఈ కొణాలన్ని అత్యంత దగ్గరిగా ఉన్న వారికి మాత్రమే తెలుస్తాయి. వీరు ఏ విషయాన్నైనా త్వరగా ఆటోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసర ఖర్చులు అస్సలు చేయరు.

చిన్న ముక్కు: ముక్కు చిన్నగా ఉన్న వ్యక్తులు త్వరగా అందరితో కలిసిపోతారు. ఎక్కువగా జనాల్లో ఉండేందుకు ఇష్టపడుతారు. అలాగే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటేందుకు ప్రయత్నిస్తారు. ఇరుగుపొరుగు వారితో ఆప్యాయంగా ఉంటారు. వీళ్లు తమ తెలివితేటలతో తాము అనున్న లక్ష్యాలను పాధిస్తారు. వీళ్లు ఎక్కువగా ప్రైవేట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

పెద్ద ముక్కు: పెద్ద ముక్కు కలిగిన వ్యక్తులకు ఇగో ఎక్కువగా ఉంటుంది. వీరు పక్కవాళ్లు ఏదైనా పనిచెప్తే అస్సలు వినరు. పక్కవాళ్ల కోసం పనిచేసేందుకు అస్సలు ఇష్టపడరు. వీరే ఒకరికి బాస్‌లా ఉండాలని అనుకుంటారు.అయితే వీళ్లు డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు, వీరు తమ పనులను ఎప్పిటికప్పుడూ చేసుకుంటారు.




