AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: అయ్యో.. ఫైనలిస్ట్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ కు గాయాలు.. బిగ్‌బాస్ సంచలన నిర్ణయం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆఖరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో సెకెండ్ ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్ల మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. అయితే ఈ ఫైనలిస్ట్ టాస్కుల్లో భాగంగా టాప్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ గాయ పడ్డాడు. దీంతో..

Bigg Boss Telugu 9: అయ్యో.. ఫైనలిస్ట్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ కు గాయాలు.. బిగ్‌బాస్ సంచలన నిర్ణయం
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Dec 12, 2025 | 7:54 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభంలో ఇమ్మాన్యుయేల్ టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. అందుకు తగ్గట్టే తన ఆట, మాట తీరుతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే అతని అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ సీజన్ స్టార్టింగ్ నుంచి మొన్నటి వీక్ దాకా అసలు నామినేషన్స్ లోకి రాలేదు. ఇది అతని ఓటింగ్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. టైటిల్ రేసులో ఉండాల్సిన ఇమ్మూ కాస్తా టాప్-3 కి పడిపోయాడు. అయితే ఎప్పుడైతే గ్రాండ్ ఫినాలే రేసు ప్రారంభమయ్యిందో ఇమ్మూ మళ్లీ విజృంభిస్తున్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిజికల్ టాస్కుల్లో అదరగొడుతున్నాడు. అందుకే ఇప్పుడు సెకండ్‌ ఫైనలిస్ట్ రేసులోనూ టాప్ లో దూసుకెళుతున్నాడు. అయితే ఈ టాస్కుల్లో శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో ఇది స్పష్టంగా కనిపించింది.

టికెట్ టు ఫినాలే రేస్ లో భాగంగా సంజన-తనూజ-ఇమ్మానుయేల్ మధ్య టాస్క్ జరిగింది. అయితే ఈ టాస్క్ లో సంజన, ఇమ్మూల మధ్య వాగ్యుద్దం జరిగింది. ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారంటూ ఇమ్మూ తీవ్ర ఆవేదన చెందాడు. . ‘నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్‌ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్‌ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు. దీంతో లీడర్‌ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక చివరిగా ఇమ్మానుయేల్- తనూజలకి ‘బ్యాలెన్స్ చెయ్ డ్యూడ్’.. అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్‌కి సంజన సంచాలక్‌గా వ్యవహరించింది. అయితే గేమ్ మధ్యలో ఇమ్మూకి సడెన్‌గా కాల్ బెణికింది. దీంతో  గేమ్  ఆడలేక కిందపడిపోయాడీ టాప్ కంటెస్టెంట్. నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఒక్కసారి పాస్ చెప్తారా ప్లీజ్ అని సంజనని రిక్వెస్ట్ చేశారు. గాయం తీవ్రంగా ఉండడంతో గేమ్ మధ్యలోనే భరణి- కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇమ్మూని లోపలికి తీసుకెళ్లారు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..