AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supritha Naidu: అరెస్ట్ వార్తల పై స్పందించిన సుప్రీత.. అసలు ఆమె ఇప్పుడు ఎక్కడుందంటే

బెట్టింగ్‌ యాప్స్ కనిపిస్తే సెలబ్రిటీలు వణికిపోవాలా...! డబ్బుల కోసం ఆ యాప్స్‌ను ప్రమోట్‌ చేయాలంటే ఖాకీ దూకుడు అన్న సినిమా 70MMలో కనిపించాలా...! అంటూ బెట్టింగ్‌ యాప్స్‌పై ఫుల్‌ సీరియస్‌గా ముందుకెళ్తున్నారు పోలీసులు. మొక్కకి అంటు కట్టినట్లు ఓ పద్దతిగా బెట్టింగ్ బూజు దులుపుతున్నారు.

Supritha Naidu: అరెస్ట్ వార్తల పై స్పందించిన సుప్రీత.. అసలు ఆమె ఇప్పుడు ఎక్కడుందంటే
Supritha
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2025 | 9:12 AM

Share

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే 11మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులు ఇచ్చారు. తాజాగా మరో ఆరుగురికి నోటీసులిచ్చిన పోలీసులు పోలీసులు. శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరిలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, హర్షసాయి పరారీలో ఉన్నారని తెలుస్తుంది. ఇద్దరూ ఇమ్రాన్, హర్షసాయి దుబాయ్ పారిపోయారని తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల.. ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. రీసెంట్ గా  పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు.

యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరానా పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు. హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై నిఘా ఉంచారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారన్న ఆరోపణలో నేపథ్యంలో సురేఖావాణి కూతురు సుప్రీత పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఆమెను కూడా అరెస్ట్ చేస్తున్నారని వార్తలు రావడంతో సుప్రీత ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ సుప్రీత. సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానెల్స్‌లో నాపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలు. నేను ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉ‍న్నాను. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. థ్యాంక్‌ యూ సో మచ్‌ ఆల్. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి.. విష్ణుప్రియ, టేస్టీ తేజతో పాటు సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి, పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌, కానిస్టేబుల్ కిరణ్‌గౌడ్, బయ్యా సన్నీ యాదవ్‌, లోకల్‌బాయ్‌ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, శ్యామలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

సుప్రీత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!