
సినిమా ప్రపంచంలో నటీనటులుగా స్టార్ స్టేటస్ సంపాదించుకోవడం అంటే అంత సులభం కాదు. ఒకవేళ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ ఇమేజ్ కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కొందరు స్టార్స్ సినీరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి.. అదే సమయంలో ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోతుంటారు. సినిమాల్లో స్టార్ డమ్ ఉన్న తారలు.. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో సతమతమవుతుంటారు. గ్లామర్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారలు.. ఆ తర్వాత అనుహ్యంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నవారు చాలా మంది ఉన్నారు. బుల్లితెరను శాసించిన ఓ నటి ఇప్పుడు దీనస్థితిలో బతుకీడుస్తుంది. ఎన్నో సీరియల్స్ చేసిన ఈ నటి.. ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా రోడ్డు పక్కన నివసిస్తుంది. తాను నటినని.. తనకు ఆశ్రయం ఇవ్వాలని వేడుకున్నప్పటికీ ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు. ఆమె పేరు సుమి హర్ చౌదరి. ఆమె బెంగాలీ నటి.
బెంగాలీ నటి సుమి హర్ చౌదరి ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో రోడ్డు పక్కన తిరుగుతూ కనిపించింది. షార్ట్స్, నల్ల చొక్కా ధరించి కాగితంపై ఏదో రాస్తూ బెంగాలీ, ఇంగ్లీష్ రెండు భాషలలో తడబడుతూ మాట్లాడుతూ కనిపించింది. ఆమెను ఎవరు గుర్తుపట్టలేదు. తాను నటి అని.. తనకు ఆశ్రయం కావాలని అక్కడ వెళ్లేవారిని అడుగుతూ కనిపించింది. ఆమె పేరు చెప్పడంతో ఆ పేరును గూగుల్ సెర్చ్ చేయగా.. ఆమె ఫోటోస్, వీడియోస్ కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
సుమి చౌదరిని పోలీసులు ప్రశ్నించగా.. మొదటిసారి తాను కోల్‌కతా నివాసిని అని చెప్పింది. ఆ తర్వాత తాను బోల్పూర్‌కు చెందిన వ్యక్తిని అని చెప్పింది. దీంతో ఆమె బెహాలా (కోల్‌కతా)లో నివసించేదని , బోల్పూర్‌లో కొంతకాలం గడిపి ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను గుర్తించిన పోలీసులు సుమీ చౌదరిని రక్షించి పునరావస కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Sumi Har Chowdhury
ఇవి కూడా చదవండి :
బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..