సరిలేరులో ‘బ్లేడు గణేశ్’..పొట్టచెక్కలవ్వడం ఖాయమట..!
సూపర్ స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . వరస విజయాలతో మంచి ఊపు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా చిత్రం జనవరి 11న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో సాంగ్స్‌ని వన్ బై వన్ సాంగ్ రిలీజ్ చేస్తూ చిత్రంపై బజ్ పెంచుతోంది టీం. ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. రష్మికా మందనా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా..లేడీ అమితాబ్ […]

సూపర్ స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . వరస విజయాలతో మంచి ఊపు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా చిత్రం జనవరి 11న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో సాంగ్స్‌ని వన్ బై వన్ సాంగ్ రిలీజ్ చేస్తూ చిత్రంపై బజ్ పెంచుతోంది టీం. ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. రష్మికా మందనా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా..లేడీ అమితాబ్ విజయశాంతి, మరో సినియర్ హీరోయిన్ సంగీత రీ ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో పాటు నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేశ్ కూడా సిల్వర్ స్రీన్‌పై చాలారోజుల తర్వాత సందడి చేయనున్నారు.
అయితే మూవీలో బండ్ల పాత్ర గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్డేడ్ అందుతోంది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ సీనియర్ కమెడియన్..పొలిటికల్ పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పలు ఇంటర్వ్యూల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలు దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాని పక్షంలో 7 ఓ క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానంటూ కామెంట్స్ చేశారు. దీనిపై అప్పట్లో మంచి బజ్ క్రియేటైంది. పలు రకాల మీమ్స్ సైతం బండ్లపై వచ్చాయి. కానీ ఆయన ప్రాతినిథ్యం వహించిన పార్టీ ఘోర పరాజయం కావడంతో..రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో బ్లేడ్‌కు సంబంధించిన ట్రాక్‌నే బండ్లకు రాసుకున్నాడట దర్శకుడు అనిల్ రవిపూడి. అతనిపై ఉన్న సిన్స్ షూటింగ్ కూడా అయిపోయాయని..అవి హిలేరియస్‌గా ప్రేక్షకులకు నవ్వులు అందించోతున్నాయని ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆఫ్ స్క్రీన్‌పై బ్లేడ్‌తో మంచి కామెడీ పంచిన బండ్ల.. ఆన్ స్రీన్‌పై ఎలా అలరిస్తాడో చూడాలి.




