జబర్దస్త్‌కు కాపీ ‘అదిరింది’.. ఇది మెగా బ్రదర్ రివెంజా.?
‘జబర్దస్త్’ డైరెక్టర్ల టీమ్ జీ తెలుగుకు షిఫ్ట్ అయ్యి ‘అదిరింది’ అనే కొత్త షో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మెగా బ్రదర్ నాగబాబు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల కావడం.. అది కాస్తా ‘జబర్దస్త్’కు కాపీలా ఉండటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఆదివారం నుంచి జీతెలుగులో ప్రసారం కానున్న ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమోను యూనిట్ విడుదల చేసింది. ‘జబర్దస్త్’కు ఏమాత్రం తీసిపోనట్లుగా […]

‘జబర్దస్త్’ డైరెక్టర్ల టీమ్ జీ తెలుగుకు షిఫ్ట్ అయ్యి ‘అదిరింది’ అనే కొత్త షో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మెగా బ్రదర్ నాగబాబు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల కావడం.. అది కాస్తా ‘జబర్దస్త్’కు కాపీలా ఉండటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు.
ఈ ఆదివారం నుంచి జీతెలుగులో ప్రసారం కానున్న ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమోను యూనిట్ విడుదల చేసింది. ‘జబర్దస్త్’కు ఏమాత్రం తీసిపోనట్లుగా అదే ఫార్ములాను షో డైరెక్టర్లు కంటిన్యూ చేస్తున్నారు. నాగబాబు హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి ఎపిసోడ్‌కు ఆయన కూతురు నిహారిక కొణిదెల కూడా జత కలవనుంది.
ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర, ఆర్పీలు ఈ షోకు టీమ్ లీడర్లు కాగా.. బుల్లితెర నటి సమీరా యాంకర్‌గా వ్యవహరిస్తోంది. మరి ‘జబర్దస్త్’కు పోటీగా ప్రారంభమైన ఈ షో ఏమేరకు టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.




