AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: అబ్బాయి కోసం బాబాయి ఆరాటం.. తారకరత్న కోలుకునేందుకు బాలయ్య మరో సంచలన నిర్ణయం

అబ్బాయి వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇక తారకరత్న ఆరోగ్యం మెరుగవ్వాలంటూ అఖండ దీపానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయస్వామి ఆలయంలో సుమారు 44 రోజుల పాటు ఈ అఖండ జ్యోతి వెలిగేలా చర్యలు తీసుకున్నారు.

Balakrishna: అబ్బాయి కోసం బాబాయి ఆరాటం.. తారకరత్న కోలుకునేందుకు బాలయ్య మరో సంచలన నిర్ణయం
Balakrishna, Tarakaratna
Basha Shek
|

Updated on: Feb 13, 2023 | 6:07 PM

Share

గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత మూడు వారాలుగా అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకునేందుకు విదేశాల నుంచి వైద్యులను కూడా రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తారకరత్న ఆరోగ్యం విషయంలో హీరో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అస్వస్థతకు గురైనప్పటి నుంచి, కుప్పం ఆస్పత్రిలో చేర్చింది మొదలు బెంగళూరు హృదయాలయ ఆస్పత్రికి తరలించే వరకు.. తారకరత్నను అంటిపెట్టుకునే ఉన్నాడు బాలయ్య. అబ్బాయి వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇక తారకరత్న ఆరోగ్యం మెరుగవ్వాలంటూ అఖండ దీపానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయస్వామి ఆలయంలో సుమారు 44 రోజుల పాటు ఈ అఖండ జ్యోతి వెలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా అబ్బాయి కోసం అహర్నిశలూ శ్రమిస్తోన్న బాలయ్య మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మానసికంగా సిద్ధంగా లేను..

కాగా ఏడాది సంక్రాంతి సందర్భంగా వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలయ్య. ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో NBK 108ను కూడా ప్రారంభించాడు బాలకృష్ణ. స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ఫిబ్రవరి మొదటి వారంలో సెకండ్ షెడ్యూల్‌కు కూడా ప్లాన్‌ చేశారు. అయితే తాజా అప్‌డేట్‌ ఏంటంటే ఈ మూవీ షూటింగ్‌ మరింత ఆలస్యం కానుందట. తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటోన్న బాలయ్య షూటింగ్‌కు హాజరుకాలేనని సినిమా యూనిట్‌ కు చెప్పేశారట. తన సినిమా సెకెండ్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ వాయిదా వేయమని కోరారట. తారకరత్న ఆస్పత్రిలో ఉండడంతో తన మానసిక పరిస్థితి ఏమి బాగాలేదని.. ఇలాంటి సమయంలో తాను షూటింగ్‌కి హాజరు కాలేనని బాలకృష్ణ తెలిపాడట. తన అబ్బాయి పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్‌కు వస్తానని తెలిపారట.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. అబ్బాయి కోసం అహర్నిశలూ శ్రమిస్తోన్న బాలయ్యపై నందమూరి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..