బాలకృష్ణ వదులుకున్న బ్లాక్‌బస్టర్స్ ఇవే.. వీటిని చేసి ఉంటే కెరీర్ ఏ రేంజ్ లో ఉండేదంటే..?
స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా వెండి తెరపై అడుగు పెట్టి స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు బాలకృష్ణ.. అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడుగా మరోవైపు హిందూపూర్ ఎమ్మెల్యేగా రాజకీయంలో కూడా రాణిస్తున్నారు. ఎన్టిఆర్ వారసుడిగా దూసుకుపోతున్నారు. తండ్రి హీరోగా నటించిన తాతమ్మ కల సినిమాతో బాలయ్య బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.. 60 ఏళ్లలో కూడా వరస హిట్స్ తో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. బాలయ్య తన సిని కెరీర్ లో అనేక సినిమాలు రిజెక్ట్ చేశారు. అవి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఈ రోజు బాలకృష్ణ వదులుకున్న సినిమాలు ఏమిటో తెలుసుకుందాం..

నందమూరి అందగాడు బాలకృష్ణ తన అన్న హరికృష్ణతో కలిసి తండ్రి ఎన్టీఆర్ హీరోగా నటించిన తాతమ్మ కల సినిమాలో నటించారు. ఈ సినిమాతోనే బాలయ్య వెండి తెరపై అడుగు పెట్టారు. అనంతరం తండ్రి నటించిన అన్నదమ్ముల అనుబంధం, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి అనేక సినిమాల్లో నటించారు. సాహసమే జీవితం అనే సినిమాతో వెండి తెరపై హీరోగా అడుగు పెట్టిన బాలకృష్ణ.. మంగమ్మ గారి మనవడు సినిమాతో ఫస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. మాస్, క్లాస్ సినిమాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నారు. రాముడిగా, జానపద హీరోగా , ఫ్యామిలీ నేపధ్యం ఇలా అనేక రకాల పాత్రల్లో ఒదిగి నటించిన బాలయ్య.. తన సినీ కెరీర్ లో పలు సినిమాలను రిజెక్ట్ చేశారు. వివిధ రీజన్స్ తో వదులుకున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకున్నవే..
- ఐదు దశాబ్దాలుగా పైగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నా బాలకృష్ణ తన సుదీర్ఘ సిని ప్రయాణంలో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మాస్ హీరోగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉనన్ బాలకృష్ణ డైలాగ్ చెబితే చాలు ఫ్యాన్స్ కు పండగే..
- అయితే బాలకృష్ణ వదులుకున్న సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి జానకి రాముడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున-విజయశాంతి జంటగా నటించారు. ఈ సినిమా కూడా మొదట బాలకృష్ణ చేయాలనుకున్నారు.. కానీ అనుకోని కారణాలతో వదులుకున్నారు. నాగార్జున సినిమా కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయి. ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్.
- కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్న సినిమా బజారు రౌడీ.. అయితే ఈ సినిమా స్టోరీని బాలకృష్ణ కోసమే రెడీ చేశారట. బాలకృష్ణ వద్దు అనడంతో రమేష్ బాబుకి దక్కింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
- బాలయ్యను వదులుకున్న మరొక చిత్రం చంటి. కథ నచ్చలేదని బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో ఈ స్టోరీ వెంకటేష్ దగ్గరకు చేరుకుంది. వెంకటేష్ కెరీర్లో చంటి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పట్లో నెలల తరబడి ఈ సినిమా థియేటర్స్ లో ఆడింది. అంతేకాదు వెంకటేష్ ద్విపాత్రాభినయం చేసి సూపర్ హిట్ అందుకున్న సూర్య వంశం మూవీని కూడా బాలకృష్ణ వదులుకున్నారట.
- అమ్మ సెంటిమెంట్ తో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన సింహరాశి సినిమా కూడా మొదట బాలకృష్ణ వద్దకు చేరుకుందట. అయితే బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా రాజశేఖర్ తలుపు తట్టింది.
- తన అన్న హరికృష్ణకు సూపర్ హిట్ ఇచ్చిన సీతయ్య సినిమా కూడా మొదటి బాలకృష్ణ వద్దకే చేరుకుందట.. తమ్ముడు వద్దు అనడంతో అన్న వద్దుకు చేరుకుంది. సీతయ్య ఎవ్వడి మాట వినడూ అంటూ సూపర్ అందుకున్నాడు.
- జూ ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ ఇచ్చిన సినిమా సింహాద్రి.. ఈ సినిమా మొదట బాలయ్య వద్దకు వెళ్ళగా ఆయన ఆసక్తి చూపించక పోవడంతో రాజమౌళి తన రెండో సినిమాకు కూడా జూ. ఎన్టిఆర్ ని హీరోగా తీసుకున్నాడు. ఈ సినిమా టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. తన నటనతో ఎన్టిఆర్ విశ్వరూపాన్ని అభిమానులకు చూపించాడు.
- చిన్న చిన్న కారెక్టర్స్ నుంచి హీరోగా సక్సెస్ అందుకున్న రవి తేజ కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన సినిమా క్రాక్. వరస ప్లాప్స్ తో ఉన్న రవి తేజకు ఈ సినిమా ఒక బూస్ట్ వంటిది అని చెప్పవచ్చు. ఈ సినిమా కధను మొదట బాలకృష్ణకు వినిపించారట. అయితే బాలయ్య వద్దు అనడంతో రవి తేజ వద్దకు చేరుకుంది.
- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాయర్ గా విశ్వరూపం చూపించిన సినిమా వకీల్ సాబ్. పింకీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆఫర్ మొదట బాలయ్యకు వెళ్లిందట.. అయితే ఈ స్టోరీ తనకు పెద్దగా వర్కౌట్ అవదని చెప్పి రిజెక్ట్ చేశారట. వకీల్ సాబ్ తో పవన్ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
- ఇలా బాలకృష్ణ డేట్లు ఖాళీ లేకపోవడమో.. లేక మరేదైన ఇతర కారణాలతోనే వదులుకున్న సినిమాలు ఇతర హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచాయి. ఒకవేళ ఈ సినిమాలను బాలకృష్ణ చేసి ఉంటే.. స్టార్ హీరోగా కెరీర్ లో ఎవరూ అందుకోలేని స్టేజ్ లో ఉండేవారేమో..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..