కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?ఈ పొరపాటు చేయకండి వీడియో
మనలో చాలా మంది కొబ్బరి నీటిని తాగినప్పుడు దానిలోని గుజ్జును తీసి పడేస్తుంటారు. కానీ కొబ్బరి గుజ్జు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. కొబ్బరి నీళ్ళలోని గుజ్జును తినడం వల్ల మన శరీరానికి ఏ విధంగా లాభం చేకూరుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొబ్బరి గుజ్జులో మాంగనీస్, రాగి, సెలీనియం, పొటాషియం, భాస్వరం, ఐరన్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సమగ్ర ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఈ ఖనిజాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా కొబ్బరి గుజ్జును తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
కొబ్బరి గుజ్జులో ఉన్న ఫైబర్, మేలైన కొవ్వులు శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుజ్జు తిన్నప్పుడు అది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటాం. ఈ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడే ఒక సహజమైన ఆహారంగా మారుతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారు కొబ్బరి గుజ్జును తింటే దాని ఫైబర్, కొవ్వుల కారణంగా క్రమంగా బరువు తగ్గవచ్చు.కొబ్బరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలోని వ్యాధి కారకాల నుండి మనల్ని రక్షిస్తాయి. కొబ్బరి నీటిని తాగిన తరువాత గుజ్జును తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. కొబ్బరి గుజ్జులో విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.