నల్లగా ఉన్నానని.. చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ సంచలన స్టేట్‌మెంట్!
కేరళ ముఖ్య కార్యదర్శి శారదా మురళీధరన్ తన చర్మ రంగు కారణంగా ఎదుర్కొంటున్న వివక్షను బహిరంగంగా ప్రస్తావించారు. ఆమె తన సోషల్ మీడియా పోస్ట్ లో, మహిళగా, నల్లని చర్మం కలిగిన వ్యక్తిగా ఎదుర్కొన్న అనేక అవమానాలను వివరించారు. అయితే, చర్మ రంగు సామర్థ్యాన్ని నిర్ణయించదు అని ఆమె స్పష్టం చేశారు.

నల్లగా ఉండడంతో ఉన్నత పదవిలో ఉన్న తాను ఎంతో వివక్షను ఎదుర్కొన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్. శరీరం రంగుకు, పనితీరుకు పోలిక ఉండదని స్పష్టం చేశారు. కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళ కావడం, తన కలర్ బ్లాక్ కావడంతో ఎన్నో రకాల వివక్షను ఎదుర్కొన్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గత సెప్టెంబర్‌లో ఆమె కేరళ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన భర్త వేణు నుంచే శారదా మురళీధరన్ బాధ్యతలు స్వీకరించారు.
అయితే ప్రతి విషయంలో తన భర్తతో పోలిక పెట్టడం బాగా లేదన్నారు శారదా. ఆఖరికి శరీర రంగు విషయంలో కూడా తన భర్తతో పోల్చిచూడడం దారుణమన్నారు. ఈ విషయంలో తన పిల్లలు అండగా నిలిచారని అన్నారు. అయితే నల్లగా ఉన్నామని ఎవరు కూడా అభద్రతా భావానికి గురి కాకూడదన్నారు శారదా. ఈ విషయంలో తాను పోరాటం చేస్తునట్టు తెలిపారు. నల్లగా ఉండడంతో తాను ఎదుర్కొంటున్న వివక్షపై కేరళ టాప్ బ్యూరోక్రాట్ ఇలా వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. నల్లగా ఉండడంతో అశక్తులం అనుకోవద్దని సూచంచారు శారదా మురళీధరన్. ఆమె వ్యాఖ్యలకు పలువురు నేతలు మద్దతు ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.