Akhanda Teaser: టీజర్ల పోటీలో నేనే నంబర్ వన్ అంటున్న నటసింహం.. రికార్డులు క్రియేట్ చేస్తున్న బాలయ్య
బాక్సాఫీస్ బొనాంజా అనే పేరు ఇప్పుడు బాలయ్య దగ్గర భద్రంగా ఉందా.. లేదా అనే విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం. బట్.. టీజర్ల పోటీలో నేనే నంబర్ వన్ అంటున్నారు మిస్టర్ లెజెండ్.
Akhanda Teaser: బొనాంజా అనే పేరు ఇప్పుడు బాలయ్య దగ్గర భద్రంగా ఉందా.. లేదా అనే విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం. బట్.. టీజర్ల పోటీలో నేనే నంబర్ వన్ అంటున్నారు మిస్టర్ లెజెండ్. అవునండీ బాబూ..! అఖండ టైటిల్ టీజర్.. సింహా మార్క్ గర్జన రిపీట్ చేస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. కొత్త గెటప్ వీడియోతో రిలీజైన ఈ టీజర్.. జస్ట్ వారం రోజుల్లోనే 29 మిలియన్ వ్యూస్ సాధించింది. మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే.. బాలయ్య లెక్క బలంగానే వుంది అని ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. రెండు నెలల కిందట రిలీజైన ఆచార్య టీజర్ ఇంకా 19 మిలియన్ల దగ్గరే వుంది. ఆరున్నర లక్షల లైక్స్ కూడగట్టుకున్న ఆచార్య ఆ విషయంలో మాత్రం దూకుడు మీదుంది. నిజమే మరి… అఖండ టీజర్ కొచ్చిన లైక్స్ జస్ట్ 4 లాక్స్. ఆ తర్వాత రిలీజైన లాహె లాహే పాట కూడా దుమ్ము రేపుతోందిగా అనేది మెగా ఫ్యాన్స్ ఇస్తున్న రిటార్ట్.రెండేళ్ల కిందటొచ్చిన సైరా టీజర్ చూడండి ఇప్పటికీ 18 మిలియన్ల దగ్గరే వుంది.. అంటూ ఫ్లాష్ బ్యాక్ తవ్వుతోంది బాలయ్య సేన. ఇదీ.. టాలీవుడ్ లో చిరూ అండ్ బాలయ్య టీజర్ల మధ్య జరుగుతున్న బిగ్ ఫైట్. సౌతిండియన్ సీనియర్ హీరోల్లో టీజర్ స్టార్ మాత్రం ఎప్పటికీ రజనీకాంతే.
మరిన్ని ఇక్కడ చదవండి :