Venu : బలగం వేణులో మరో టాలెంట్.. ఏకంగా రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ కూడా..
బలగం సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన బలగం సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బలగం తర్వాత వేణు పేరు మారుమ్రోగింది. బలగం సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా చేస్తాడంటూ ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత దర్శకుడిగా తనలోని ప్రతిభను చాటుకున్నాడు వేణు. పలు సినిమాల్లో కమెడియన్ గా హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు వేణు. ఇక బలగం సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన బలగం సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బలగం తర్వాత వేణు పేరు మారుమ్రోగింది. బలగం సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా చేస్తాడంటూ ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు నేచురల్ స్టార్ నానితో సినిమా చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాకు ఎల్లమ్మ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారట.
ఇదిలా ఉంటే వేణు కు సంబందించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కామెడీ టైమింగ్ , డైరెక్షన్ తో పాటు మరో టాలెంట్ కూడా ఉందట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు తన గురించి తెలిపాడు. చిన్నపాటి నుంచి తనను అందరూ బాబూ మోహన్ లా ఉన్నావ్ అని లేదంటే బాబూమోహన్ దగ్గర బంధువుల ఉన్నావ్ అంటూ ఆటపట్టించే వారట.. దాంతో కామెడీ పై సినిమాల పై ఆసక్తి పెరిగిందని తెలిపారు వేణు.
అంతే కాదు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. అంతే కాదు మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ గా కూడా విన్ అయ్యానని తెలిపాడు వేణు. చుట్టూ ఉన్నవారిలో తాను స్పెషల్ గా ఉండాలి.. అందరూ తనని గుర్తించాలని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను అని తెలిపారు వేణు. ఇక ఇప్పుడు వేణు నాని సినిమా పై కసరత్తులు చేస్తున్నారు. మరోసారి తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పై మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు వేణు.
వేణు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
వేణు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
