AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటి సుధా ఈవిడా..! నటనలోనే కాదు అందంలోనూ అద్భుతమే..!!

కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో బలగం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలగం సినిమాకు నటుడు వేణు దర్శకత్వం వహించారు. కుటుంబ బంధాలు గురించి ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు.

ఏంటి సుధా ఈవిడా..! నటనలోనే కాదు అందంలోనూ అద్భుతమే..!!
Balagam
Rajeev Rayala
|

Updated on: Oct 04, 2024 | 11:50 AM

Share

కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి.. మరికొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటాయి. ఇక కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో బలగం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలగం సినిమాకు నటుడు వేణు దర్శకత్వం వహించారు. కుటుంబ బంధాలు గురించి ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ఈ సినిమాలో కనిపించిన అందరూ అద్భుతంగా చేసి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా ఈ సినిమాలో మరో నటి కూడా హైలైట్ అయ్యారు ఆమె రూప లక్ష్మీ.

ఇది కూడా చదవండి : కుమ్మేస్తున్న కుర్ర భామ.. ఈ తెలుగు అమ్మాడి అందాలు వరుస కడుతున్న ఆఫర్స్

సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో రూప లక్ష్మీ ఒకరు. నీదినాది ఒకటే కథ అనే సినిమాతో రూప లక్ష్మీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక బలగం సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బలగం సినిమాలో రూపలక్ష్మి పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఆమె చాలా సహజసిద్ధమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లచ్చవ్వ క్యారెక్టర్‏ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి

ఈసెంట్ గా దేవర సినిమాలోనూ నటించింది రూప లక్ష్మీ. ఈ టాలెంటడ్ నటి పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. రూప లక్ష్మీకి 13 ఏటనే పెళ్లిఅయిందట. అలాగే 16 ఏటనే పాప పుట్టిందని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె అందం అనే దాన్ని పక్కన పెట్టేసా అని తెలిపారు. ఫ్యామిలీతో నవ్వుతూ గడపడం, నచ్చిన పని చేయడమే నా దృష్టిలో అందం అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రూపలక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి : Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.